డబ్బింగ్ రూపంలో చాలానే వచ్చాయి కానీ విజయ్ ఆంటోనీ పేరు చెబితే గుర్తొచ్చే సినిమా బిచ్చగాడు మాత్రమే. ఏళ్ళు గడుస్తున్నా ఆ బ్రాండ్ వేల్యూ మాత్రం తగ్గడం లేదు. దీని ఎఫెక్ట్ ఎంతగా ఉందంటే వరస ఫ్లాపులతో అతని మార్కెట్ ఎప్పుడో పడిపోయినా బిచ్చగాడు 2కి మాత్రం గ్రాండ్ ఓపెనింగ్స్ దక్కాయి. కమర్షియల్ గానూ మంచి విజయం అందుకుంది. దీనికి ముందు తర్వాత వచ్చినవేవీ కనీస స్థాయిలో ఆడలేదు. గత చిత్రం హత్య మరీ దారుణంగా పబ్లిసిటీ ఖర్చులు కూడా తేలేదు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన విషయం కూడా జనాలకు గుర్తు లేదు.
ఈ నేపథ్యంలో రేపు విడుదల కాబోతున్న లవ్ గురు మీద విజయ్ ఆంటోనీ భారీ నమ్మకం పెట్టుకున్నాడు. ఈసారి మాస్ అంశాల జోలికి వెళ్లకుండా లవ్ జానర్ ని టచ్ చేశాడు. పెళ్ళైన కొత్త జంట మధ్య ఉండాల్సిన అనుబంధం, అండర్ స్టాండింగ్ గురించి పాఠాలు చెప్పబోతున్నాడు. కంటెంట్ మీద నమ్మకంతో రెండు రోజుల ముందే హైదరాబాద్ లో ప్రీమియర్ వేసి, పబ్లిక్ ఒపీనియన్ ని రికార్డు చేయించి ప్రమోషన్ కోసం వాడుతున్నాడు. మైత్రి మూవీస్ మేకర్స్ అండదండలు దక్కడంతో పంపిణిపరంగా ఇబ్బందులు లేకుండా చెప్పుకోదగ్గ కౌంట్ లో థియేటర్లు దక్కబోతున్నాయి.
ఇది సక్సెస్ అయితేనే విజయ్ ఆంటోనీ టాలీవుడ్ మనుగడ మీద ఆశలు పెట్టుకునే అవకాశముంటుంది. మృణాళిని రవి హీరోయిన్ గా నటించిన ఈ ఎంటర్ టైనర్ లో మొత్తం తమిళ క్యాస్టింగే ఉన్నా కాన్సెప్ట్ మాత్రం షారుఖ్ ఖాన్ రబ్ నే బనాది జోడి తరహాలో ఉంటుందని ఆల్రెడీ షో చూసినవాళ్లు నుంచి వస్తున్న రిపోర్ట్. బాలేదని ఎవరూ చెప్పలేదు కానీ విజయ్ ఆంటోనీ ఎంతమేరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి. కొన్ని నెలలుగా డల్ గా ఉన్న డబ్బింగ్ మార్కెట్ కి ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ ఊపిరి పోశాయి. వాటి సరసన లవ్ గురు చేరుతుందో లేదో రేపు తేలిపోతుంది.
This post was last modified on April 10, 2024 6:10 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…