Movie News

పుష్ప వ్యూస్ మీద రాద్ధాంతం ఎందుకు

మొన్న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పుష్ప 2 ది రూల్ టీజర్ లో ఊహించని గెటప్ తో బన్నీని చూపించిన విధానం షాక్ ఇచ్చిన మాట నిజమే కానీ ఇంకా చాలా ఊహించుకున్న ఫ్యాన్స్ కొంత అసంతృప్తికి గురైన మాట వాస్తవం. అయితే దర్శకుడు సుకుమార్ కావాలనే ఒక ప్లాన్ ప్రకారం హైప్ ని బిల్డ్ చేసే క్రమంలో అసలు కంటెంట్ ని ఇంకా బయటికి వదల్లేదనే కామెంట్స్ లేకపోలేదు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ లో ఈ వీడియోకు వచ్చిన వ్యూస్ మీద సోషల్ మీడియాలో రాద్ధాంతం జరుగుతోంది. రెండు రోజుల్లో వచ్చిన 88 మిలియన్ వీక్షణలు నిజం కాదనేది టాపిక్.

మాములుగా ప్యాన్ ఇండియా సినిమాలు వివిధ మార్గాల్లో స్టార్ హీరోల అభిమానుల కోసం వ్యూస్ ఎక్కువ వచ్చేలా రకరకాల ఎత్తుగడలు వేసుకుంటారు. ఇది అందరూ చేసేదే. థర్డ్ పార్టీ ద్వారా కాంట్రాక్టు తీసుకుని వివిధ మార్గాల్లో పెంచుకోవడం ఒకటైతే, ప్రత్యేకమైన పిఆర్ టీమ్ ని ఏర్పాటు చేసుకుని దీని మీదే వర్క్ చేస్తూ రికార్డులు వచ్చేలా చూసుకోవడం మరో స్ట్రాటజీ. అఫీషియల్ గా యాడ్స్ ని జొప్పించడం ద్వారా పెంచడమనే ఇంకో పద్ధతి కూడా అమలులో ఉంది. ఇవి కాకుండా సింపుల్ గా అప్లోడ్ చేసి నిజాయితీగా ఎన్ని వ్యూస్ వస్తాయనేది వ్యూయర్స్ కి వదిలిపెట్టడం ఇంకో మెథడ్.

వీటిలో పుష్ప ఏదో ఫాలో అయ్యిందో చెప్పడం కష్టం. అలాంటప్పుడు ఆధారాలు లేకుండా వ్యూస్ ఒరిజినల్ కాదని ఫేకని ప్రాపగండా చేయడం ఎంత వరకు కరెక్టని బన్నీ ఫ్యాన్స్ మాట. అయినా పుష్ప బ్రాండ్ కి ప్రత్యేకంగా మార్కెటింగ్ అవసరం లేదు. బోలెడు క్రేజ్ ఉంది. ఉత్తరాదిలోనూ భారీ రేట్లతో కొనేందుకు బయ్యర్లు సిద్ధంగా ఉన్నారు. ఆగస్ట్ 15 ఇంకా దూరంలో ఉంది. ట్రైలర్, లిరికల్ వీడియోస్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా బోలెడు ప్రమోషన్లు రావాల్సి ఉంది. ఇప్పుడు పుష్ప టీజర్ మీద ఇంత చర్చ అవసరం లేదన్నది అభిమానుల వాదన. నిజమే కానీ అంత ఆలోచించేది ఎవరు.

This post was last modified on April 10, 2024 6:07 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

52 minutes ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

2 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

2 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

2 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

5 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

5 hours ago