జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ దేవరని ఉత్తరాదిలో పంపిణీ చేసేందుకు కరణ్ జోహార్, అనిల్ తదానిలు సంయుక్తంగా చేతులు కలపడంతో బాలీవుడ్ గ్రాండ్ వెల్కమ్ కి రంగం సిద్ధమయ్యింది. బాహుబలిని వీళ్లిద్దరే కొని పంపిణి చేసి దానికి బ్రహ్మాండమైన మార్కెటింగ్ చేయడమే కాక థియేటర్ల పరంగా పెద్ద కౌంట్ వచ్చేలా చూసుకోవడంతో ఖాన్లు సృష్టించిన రికార్డులు బద్దలు కొట్టడం సాధ్యమయ్యింది. ఇప్పుడు ఈ జోడినే దేవరకే అండగా ఉండటంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు.
ఆర్ఆర్ఆర్ ని పెన్ స్టూడియోస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. అయితే అది తారక్ సోలో హీరోగా నటించిన సినిమా కాదు. కానీ దేవర పూర్తిగా యంగ్ టైగర్ ని ప్రొజెక్ట్ చేసే పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. నార్త్ లో దేవర మేజిక్ వర్కౌట్ అయ్యేందుకు ఈ ఒక్క ఫ్యాక్టరే పని చేయడం లేదు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేయడం, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించడం లాంటి అంశాలు ఆసక్తి పెరిగేందుకు దోహద పడుతున్నాయి. దేవరతో హిందీలోనూ బలమైన ముద్ర వేయాలని చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కు ఇది బ్లాక్ బస్టర్ అయితే కలిగే ప్రయోజనాలు ఎన్నో దక్కబోతున్నాయి.
హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ పంచుకోబోతున్న వార్ 2కి సంబంధించి దేవర సక్సెస్ హెల్ప్ అవుతుంది. తానొక్కడే హీరో కాకపోయినా ఆర్ఆర్ఆర్, దేవరలు తెచ్చిన ఇమేజ్ బిజినెస్ పరంగా మరింత ఉపయోగపడతాయి. అక్టోబర్ 10 విడుదల కాబోతున్న మొదటి భాగం చెప్పిన డేట్ కి రావడం ఖాయమే. ఈసారి ఎలాంటి వాయిదాలు లేకుండా దర్శకుడు కొరటాల శివ జాగ్రత్త పడుతున్నారట. బ్యాలన్స్ ఉన్న పాటల పనిని సెప్టెంబర్ మొదటివారం లోగా అయిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం మీద మూవీ లవర్స్ అంచనాలు అన్ని ఇన్ని కావు.
This post was last modified on April 11, 2024 9:43 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…