ఒకప్పుడు ఆడియో లాంచ్ అంటే ఒకేసారి ఆల్బమ్ లో ఉన్న పాటలన్నీ క్యాసెట్ లేదా సిడి ద్వారా రిలీజయ్యేవి. ముప్పై నుంచి నూటా యాభై రూపాయల మధ్య ధరలో తమ అవసరానికి తగ్గట్టు శ్రోతలు వాటిని కొని వినేవాళ్ళు. ఇంత టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి అన్ని సాంగ్స్ ఆస్వాదించాల్సిందే. ఫ్లాప్ అయిన సినిమాలు సైతం మ్యూజిక్ కంపెనీలకు లాభాలు తెచ్చిన దాఖలాలు బోలెడు. కానీ యూట్యూబ్ కాలంలో మొత్తం మారిపోయింది. ప్రమోషన్ల పేరుతో ఒక్కో పాటని ఒక్కో సందర్భంలో లిరికల్ వీడియో పేరుతో నెమ్మదిగా రిలీజ్ చేయడం వల్ల కొన్నింటికి అనుకున్న రీచ్ రావడం లేదు.
ఈ ట్రెండ్ వల్ల సంగీత దర్శకుల కష్టం పూర్తి స్థాయిలో ఆడియన్స్ ని చేరడం లేదని మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పదిరోజులకో పాట కాకుండా అన్ని సాంగ్స్ ఒక ప్యాకేజీలా ఒకేసారి ఇస్తేనే మంచిదని చెప్పారు. దాన్ని నిర్మాత దిల్ రాజు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణిలు అమలు పరిచారు. ఈ నెల 25 విడుదల కాబోతున్న లవ్ మీ ఇఫ్ యు డేర్ ఆడియో లాంచ్ నిన్న గ్రాండ్ గా నిర్వహించారు. దశాబ్దాల తర్వాత ఒక తెలుగు సినిమాలో అన్ని పాటలు ఒకేసారి రిలీజ్ చేసిన అరుదైన సందర్భాన్ని సృష్టించారు. స్టేజి మీద లైవ్ కన్సర్ట్ కూడా చేశారు.
ఇప్పుడీ పద్ధతి వల్ల ఇప్పటికిప్పుడు అనూహ్య ఫలితాలు రాకపోవచ్చు కానీ భవిష్యత్తులో మార్పుని చూడొచ్చు. ఎందుకంటే ఒక పాట రేపిన అసంతృప్తిని ఇంకో పాట బ్యాలన్స్ చేయడం ద్వారా ప్రేక్షకుల్లో అంచనాల పరంగా ఇబ్బందులు తలెత్తవు. అలా కాకుండా ముందు వచ్చింది ఏ మాత్రం నచ్చకపోయినా ఏకంగా దాని ప్రభావం హైప్ మీద పడుతుంది. గుంటూరు కారం టైంలో ఓ మే బేబీ గురించి జరిగిన రాద్ధాంతం గుర్తుందిగా. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లవ్ మీ ఇఫ్ యు డేర్ కి కీరవాణి, పిసి శ్రీరామ్ లాంటి ఉద్దండులు పని చేశారు. దర్శకుడిగా అరుణ్ పరిచయమవుతున్నారు.
This post was last modified on April 10, 2024 11:37 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…