Movie News

జెర్సీ దర్శకుడి మీద కొండంత బరువు

అర్జున్ రెడ్డి, గీత గోవిందం రేంజ్ లో బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఫలితం తీవ్ర నిరాశను మిగిల్చింది. రెండు వందల కోట్ల కలను నిజం చేయకపోయినా కనీసం సూపర్ హిట్ అనిపించుకున్నా మార్కెట్ పరంగా చాలా ఉపయోగపడేది. కానీ నిర్మాత దిల్ రాజు ఎంతగా పుష్ చేయాలని చూసినా లాభం లేకపోయింది. దీనికన్నా పన్నెండో రోజులో ఉన్న టిల్లు స్క్వేర్ కు ఎక్కువ కలెక్షన్లు రావడం కన్నా బాధ పెట్టేది ఏముంటుంది. సరే ఫ్లాపులు ఎవరికైనా సహజమే కానీ రౌడీ హీరో నెక్స్ట్ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వేసవిలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందనుంది. నిజానికిది మొన్న డిసెంబర్ నుంచే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ ది ఫ్యామిలీ స్టార్ ని ముందు పూర్తి చేయాలన్న సంకల్పంతో దీనికి బ్రేక్ వేశారు. ఈలోగా అదే సంస్థలో గౌతమ్ కొత్త క్యాస్టింగ్ తో మేజిక్ అనే చిన్న మూవీ తీసేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు తన మీద పలు బరువులున్నాయి. మొదటిది విజయ్ దేవరకొండకు ఖచ్చితంగా సక్సెస్ ఇవ్వడం. పెడుతున్న బడ్జెట్ కు న్యాయం జరిగేలా పెద్ద బాక్సాఫీస్ హిట్ వచ్చేలా చూడటం.

అసలు గౌతమ్ కే ఇది డూ ఆర్ డై లాంటి ప్రాజెక్టు. జెర్సీ తర్వాత దాని హిందీ రీమేక్ ని షాహిద్ కపూర్ తో చేసి దారుణమైన డిజాస్టర్ చవిచూశాడు. రామ్ చరణ్ తో సినిమా చేతి దాకా వచ్చి జారిపోయింది. తనను వదులుకోవడం తప్పని ఋజువు చేయాలంటే విజయ్ దేవరకొండ మూవీని మాములు హిట్ చేయిస్తే సరిపోదు. రికార్డులు బద్దలు కొట్టించాలి. దీనికన్నా ముందు మేజిక్ తో విజయం సాధించే తీరాలి. లైగర్ నుంచి ది ఫ్యామిలీ స్టార్ వరకు విజయ్ మార్కెట్ లో భారీ తగ్గుదల వచ్చేసింది. తిరిగి దాన్ని నిలబెట్టాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. స్పై బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ తో ఉంటుందట.

This post was last modified on April 9, 2024 10:06 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

54 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

1 hour ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

4 hours ago