దేవర విషయంలో జరుగుతున్న జాప్యం అభిమానులను ఎంత కలవరపెడుతుందో జూనియర్ ఎన్టీఆర్ కి తెలియంది కాదు. పరిస్థితులు అనుకూలించి ఉంటే ఏప్రిల్ 5 రిలీజై ఈ పాటికి థియేటర్లలో రచ్చ జరిగి ఉండాల్సింది. ఇది నిర్మాణంలో ఉన్నంత కాలం తారక్ బయట పబ్లిక్ ఈవెంట్లకు వచ్చిన దాఖలాలు తక్కువ. అన్నయ్య కళ్యాణ్ రామ్ కోసం హాజరయ్యాడు కానీ మరీ జోష్ తో కనిపించిన సందర్భాలు వేళ్ళ మీద లెక్క బెట్టొచ్చు. దీనికి భిన్నంగా టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కు వచ్చిన జూనియర్ మంచి హుషారుగా కనిపించడమే కాదు దేవరకు సంబంధించిన కీలక అప్డేట్స్ ఇచ్చేశాడు.
వాటిలో మొదటిది కాలర్ ఎగరేయడం. కొంచెమే అతిగా అనిపించినా పర్వాలేదు, నమ్మకంగా చెబుతున్నా దేవర చూశాక నాలాగే చొక్కాలు వేసుకుని దేవర చూసినవాళ్లు గర్వంగా కాలర్ ని పైకెత్తడం ఖాయమని నొక్కి చెప్పడం ఆడిటోరియంని చప్పట్లతో హోరెత్తించింది. అంతే కాదు తన సినిమా నేపథ్యం భయం చుట్టూ ఉంటుందని, దాన్ని ఎలా ఎదురుకోవాలనే పాయింట్ ని చూపిస్తుందని డైలాగు రూపంలో చెప్పడంతో ఈసారి విజిల్స్ మోతెక్కిపోయాయి. మాటల్లో హుషారు తొణికిసలాడుతూ ఉండగా తారక్ చేసిన ప్రసంగం కాసేపు ఇది టిల్లు స్క్వేర్ వేడుకేనా అనిపించేలా చేసింది.
ఏదైతేనేం ఫ్యాన్స్ కోరుకున్నదే జరిగింది. త్రివిక్రమ్ ని ఉద్దేశించి అత్తారింటికి దారేది డైలాగుని వాడుకుని తారక్ తన అభిమానాన్ని చాటడం ఆకట్టుకుంది. అరవింద సమేత వీర రాఘవ రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పి మళ్ళీ పని చేయాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచాడు. గతంలో అల వైకుంఠపురములో తర్వాత తారక్-త్రివిక్రమ్ కాంబోలో ప్రకటించిన సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాని స్థానంలోనే గుంటూరు కారం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ తో మూవీ చేశాక మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ లు చేతులు కలిపే అవకాశం లేకపోలేదు. అందరూ కోరుకునేది అదే.
This post was last modified on April 9, 2024 3:52 pm
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…