ఇవాళ రిలీజైన టీజర్ కాని టీజర్ గురించి అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద చర్చే జరుగుతోంది. షాక్ ఇచ్చే లేడీ గెటప్ లో మాస్ కి కిక్ ఇచ్చే బాడీ లాంగ్వేజ్ తో ఫైట్ చేసిన తీరు గూస్ బంప్స్ ఇచ్చాయి కానీ ఈ లుక్ ని గత ఏడాది పోస్టర్ రూపంలో ఆల్రెడీ చూసిందే కావడంతో భారీ జోష్ రాలేదని ఫీలవుతున్నారు. వ్యూస్ పరంగా రికార్డులు వస్తున్నాయి, బాలీవుడ్ క్రిటిక్స్ భేషని మెచ్చుకున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఇతర ఆర్టిస్టులు ఎవరూ లేకుండా, స్టోరీ గురించి చిన్న క్లూస్ ఇవ్వకుండా చిన్న వీడియోని ఎందుకు వదిలారంటే దాని వెనుక దర్శకుడు సుకుమార్ వ్యూహం ఉందని తెలుస్తోంది.
విడుదలకు ఇంకా నాలుగు నెలల సమయముంది. కీలకమైన కంటెంట్ ని ఇప్పుడే ప్రమోషన్ కోసం వాడేస్తే రిలీజ్ నాటికి థ్రిల్ తగ్గిపోతుంది. పైగా ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి హైప్ పరంగా అన్ని భాషల్లో ఒకే టెంపో వచ్చేలా చూసుకోవాలి. అలా జరగాలంటే నెల లేదా నెలన్నర ముందుగానే ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో కేవలం గంగమ్మ జాతర ఎపిసోడ్ లుక్ ని రివీల్ చేయడంతో ఆపేసి ఆ సస్పెన్స్ ని అలాగే కొనసాగించాలనేది సుక్కు ఆలోచన. అసలే షూటింగ్ పీక్స్ లో ఉంది. కొత్త టీజర్ ఎడిటింగ్ చూసుకునేంత టైం, తీరిక సుకుమార్ కు లేదు. అందుకే సింగల్ షాట్ వీడియో వదిలారు.
అసలైన పబ్లిసిటీని జూన్ నుంచి తప్ప అంతకన్నా ముందు ఆశించే పరిస్థితి కనిపించడం లేదు. అయినా ఎంత తక్కువ లెన్త్ ఉన్నా బిజినెస్ పరంగా ఇవాళ వచ్చిన వీడియో చాలా ఉపయోగపడేలా ఉంది. నార్త్ సర్కిల్స్ లో డిస్కషన్లు మొదలయ్యాయి. ఉత్తరాది ప్రేక్షకులకు నచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపించడంతో దీని మీద ఎంతమేర పెట్టుబడి పెట్టొచ్చనే కోణంలో విశ్లేషణలు చేస్తున్నారు. ఇంకోవైపు డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అనసూయ, సునీల్, ఫహద్ ఫాసిల్ తదితరులు హైదరాబాద్ లో ఈ పని మీదే ఉన్నారు. ఎలాంటి సందేహం లేకుండా ఆగస్ట్ 15 రిలీజ్ మాత్రం పక్కానే.
This post was last modified on April 8, 2024 9:55 pm
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…
తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…
ఏపీలో కూటమి ప్రభుత్వం చేసే ఖర్చులు, తీసుకునే నిర్ణయాలను సమీక్షించి.. నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా మూడు కమిటీలు ఉంటాయి. ఇది…
ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి?…
పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…