ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ గురించి తెలుగు ప్రేక్షకులే కాదు నార్త్ నుంచి సౌత్ దాకా మూవీ లవర్స్ తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 1 ది రైజ్ దక్షిణాది కంటే ఉత్తరాదిలో ఎక్కువ విజయం సాధించడం ఒక కారణమైతే, టాలీవుడ్ కు ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ అవార్డు సాధించిన ఘనత కూడా దాని వల్లే దక్కడంతో ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. అందుకే ఇవాళ బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోయే టీజర్ మీద అందరి కళ్ళు ఉన్నాయి. వీడియో నిడివి తక్కువగానే ఉన్న పుష్పరాజ్ రియల్ మాస్ ని మరోసారి బలంగా ఆవిష్కరించారు.
కథకు సంబంధించి ఎలాంటి క్లూస్ ఇవ్వలేదు కానీ అల్లు అర్జున్ వేసిన షాకింగ్ గెటప్ ని చూపించారు. చిత్తూరు జిల్లాలో సుప్రసిద్ధి చెందిన గంగమ్మ జాతరలో మగాళ్లు ఆడవేషం వేసుకుని మొక్కులు చెల్లించుకునే సంప్రదాయం దశాబ్దాల తరబడి ఉంది. పుష్పరాజ్ కూడా సిద్ధ పడతాడు. చీర, చెవి కమ్మలు, నగలు, నెత్తుటితో నుదుటి మీద బొట్టు, మొహంతో పాటు దేహమంతా అలంకారం చూస్తేనే ఒళ్ళు గగుర్పొడించేలా ఉన్నాడు. దేవత దగ్గరికి వెళ్తూ అడ్డొచ్చిన రౌడీలను తనదైన స్టైల్ లో చితకబాదుతూ వెళ్లే సీన్ అభిమానులకు గూస్ బంప్స్ అనే పదం చిన్నదే అనిపిస్తుంది.
ఆగస్ట్ 15 విడుదల తేదీని మరోసారి ధృవీకరిస్తూ పుష్ప 2 ది రూల్ టీజర్ చివర్లో క్లారిటీ ఇచ్చేసింది. దేవిశ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం, మిరెస్లో కుబా బ్రోజెక్ ఛాయాగ్రహణం సుకుమార్ విజన్ ని చక్కగా ఆవిష్కరించాయి. పుష్ప 1ని మించి ఎన్నో రెట్లు సీక్వెల్ ఉంటుందని టీమ్ ముందు నుంచి చెబుతున్న మాటలకు తగ్గట్టే అల్లు అర్జున్ గెటప్ ఒక అవగాహన ఇచ్చింది. టీజర్ అన్నారు కానీ ఇందులో ఇతర క్యాస్టింగ్ ని, సన్నివేశాలను ఏవీ రివీల్ చేయలేదు కాబట్టి ట్రైలర్ వచ్చే దాకా ఆగాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన పుష్ప 2 మీద వెయ్యి కోట్ల దాకా బిజినెస్ అంచనాలున్నాయి.
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…