అసలు సందర్భమే లేకుండా నాగ చైతన్య, అల్లు అరవింద్ సోషల్ మీడియాలో టాపిక్ గా మారడానికి ది ఫ్యామిలీ స్టార్ కారణం కావడం అనూహ్యమనే చెప్పాలి. సినిమా ఫలితం ఎటు వెళ్తోందో తెలిశాక అత్యంత అదృష్టవంతులు వీళ్ళేనంటూ అభిమానులు రకరకాల మీమ్స్, వీడియోలు ఎడిట్ చేసి పెట్టడం నిన్నటి నుంచే జరుగుతోంది. దీనికి కారణాలు అధిక శాతం జనాలకు తెలిసినప్పటికీ కొన్ని లోతైన కోణాలు చూద్దాం. సర్కారు వారి పాట కన్నా ముందు దర్శకుడు పరశురామ్ చైతుకి ఒక కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. దానికి తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్ పనులు మెల్లగా మొదలు పెట్టారు .
ఈలోగా మహేష్ బాబు కాల్ రావడంతో నాగచైతన్యది పెండింగ్ పెట్టక తప్పని పరిస్థితుల్లో పరశురామ్ అటు వెళ్ళిపోయాడు. ఇంతా చేసి బ్లాక్ బస్టర్ అందుకోలేకపోవడం వేరే సంగతి. అల్లు అరవింద్ కు ఒక కమిట్ మెంట్ ఇచ్చిన ఇదే పరశురామ్ దాన్ని విజయ్ దేవరకొండ కాంబోలోనే చేయాల్సి ఉందని గట్టి ప్రచారమే జరిగింది. ఈలోగా అనూహ్య పరిణామాలు జరిగి నిర్మాత దిల్ రాజు పేరు మీద ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ వచ్చింది. అప్పటికే అరవింద్ అడ్వాన్స్ పరశురామ్ దగ్గర ఉందని వినికిడి. దీంతో ఆయన హర్ట్ కావడం, సీరియస్ గా ప్రెస్ మీట్ పెట్టాలనుకోవడం వాస్తవమే.
వ్యవహారం రచ్చకెక్కుతోందని అంతదాకా వెళ్లకుండా సన్నిహితులు ఆపేశారు. కట్ చేస్తే ది ఫ్యామిలీ స్టార్ వచ్చేసింది. యావరేజ్ అనిపించుకున్నా పండగ సెలవుల వల్ల హిట్ వైపు వెళ్లే అవకాశం దక్కేది. కానీ గ్రౌండ్ రిపోర్ట్స్ అలా లేవు. సో నాగ చైతన్య, అల్లు అరవింద్ లక్కీగా తప్పించుకున్నది ఇదేనని ఫ్యాన్స్ వైపు వినిపిస్తున్న మాట. ఇవన్నీ నిజాలని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు కానీ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న రకరకాల చర్చలను విశ్లేషిస్తే తేలే మ్యాటర్ ఇదే. దీని సంగతేమో కానీ చైతు, అరవింద్ మాత్రం తండేల్ కోసం చేతులు కలిపి బాగా కష్టపడుతున్నారు.
This post was last modified on April 6, 2024 6:16 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…