తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే ముందు చివరగా నటించిన చిత్రం.. జననాయగన్. తెలుగు హిట్ మూవీ భగవంత్ కేసరికి రీమేక్‌గా తెరకెక్కినప్పటికీ… విజయ్ పొలిటికల్ జర్నీకి ఉపయోగపడేలా ఇందులో రాజకీయ అంశాలను బాగానే దట్టించారు.
ఈ సినిమాతో తన అభిమానులను మురిపించడమే కాక.. తన రాజకీయ భావజాలాన్ని జనాలకు కాస్త ఎక్కించాలని బాగానే ప్లాన్ చేసుకున్నాడు విజయ్. అంతా అనుకున్న ప్రకారం జరిగితే.. ఎన్నికలకు మూణ్నాలుగు నెలల ముందు ఈ సినిమా తమిళనాడును ఒక ఊపు ఊపేసి ఉండాలి. కానీ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా కాస్తా.. సెన్సార్ సమస్యలతో అనూహ్యంగా వాయిదా పడిపోయింది.
కొన్ని రోజుల తర్వాత అయినా సమస్యకు పరిష్కారం లభిస్తుందని.. సినిమా రిలీజవుతుందని ఆశించారు ఫ్యాన్స్. కానీ సమస్య ఎంతకీ తెగట్లేదు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. ఎన్నికల లోపు జననాయగన్ రిలీజయ్యే సంకేతాలు కనిపించడం లేదు.
ఇప్పటిదాకా విజయ్.. నిర్మాతలకు మద్దతుగా నిలుస్తూ సినిమాను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కానీ ఎక్కడా ఈ సినిమా రిలీజ్ ఆగిపోవడం గురించి, దీనికి దారి తీసిన కారణాల గురించి అతను మాట్లాడలేదు. ఐతే తాజాగా విజయ్ ఒక ఇంగ్లిష్ డైలీకి ఇచ్చిన పొలిటికల్ ఇంటర్వ్యూలో ఈ సినిమా సంగతి ప్రస్తావనకు వచ్చింది.
తన సినిమా రిలీజ్ ఆగిపోవడానికి రాజకీయాలేకారణమన్నట్లుగా విజయ్ అనుమానం వ్యక్తం చేశాడు. అలాగే జననాయగన్ నిర్మాత నిర్మాత కె.నారాయణ విషయంలో అతను ఆవేదన వ్యక్తం చేశాడు.
నా నిర్మాతల గురించి నాకు బాధగా ఉంది. నేను రాజకీయాల్లోకి రావడం వల్లే ఈ సినిమాకు ఇలా జరుగుతోంది. నా కారణంగా నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. రాజకీయ రంగంలోకి అడుగు పెట్టకముందే వీటికి నేను సిద్ధంగా ఉన్నాను. నా సినిమాపై ప్రభావం పడుతుందని ముందే ఊహించాను అని విజయ్ వ్యాఖ్యానించాడు. ఐతే జననాయగన్ వెనుక ఎవరు కుట్ర చేశారు.. ఆ సినిమా ఎప్పుడు రిలీజవుతుంది అనే విషయాలపై విజయ్ ఏమీ మాట్లాడలేదు.
This post was last modified on January 31, 2026 10:22 pm
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…