Trends

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా 46 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించిన భారత్, కివీస్ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఇషాన్ కిషన్ కేవలం 43 బంతుల్లోనే 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 103 పరుగులు చేసి సెంచరీతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో 63 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 42 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అభిషేక్ శర్మ (30), సంజు శామ్సన్ (6) పరుగులు చేయగా, చివర్లో శివం దూబే సిక్సర్‌తో ముగించాడు.

272 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బ్యాటర్లలో ఫిన్ అలెన్ 38 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 80 పరుగులు చేసి భారత్‌ను భయపెట్టాడు. అతనికి తోడుగా రచిన్ రవీంద్ర (30) రాణించినా విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. చివర్లో సోధి (33)తో కాస్త మెరిశాడు. కానీ అప్పటికే కివీస్ నుంచి మ్యాచ్ చేజారింది.

కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం న్యూజిలాండ్ కొంపముంచింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 51 పరుగులిచ్చి 5 వికెట్లతో కివీస్ నడ్డి విరిచాడు. అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి మరియు రింకూ సింగ్ తలా ఒక వికెట్ సాధించారు.

ముఖ్యంగా 19.4వ ఓవర్‌లో రింకూ సింగ్ ఇష్ సోధిని అవుట్ చేసి మ్యాచ్‌ను ముగించడంతో భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఈ విజయంతో టీమిండియా 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుని, రాబోయే టీ20 వరల్డ్ కప్‌కు తాము సిద్ధమని ప్రత్యర్థులకు బలమైన సంకేతాలు పంపింది. ఇషాన్ కిషన్ సెంచరీతో ఫామ్‌లోకి రావడం, అర్ష్‌దీప్ సింగ్ వికెట్ల వేట సాగించడం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

This post was last modified on January 31, 2026 11:04 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

12 hours ago