ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సారి నంది నగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి కేసీఆర్ పీఏ చేతికి నోటీసులిచ్చిన సిట్ అధికారులు…రెండోసారి మాత్రం నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోని గోడకు నోటీసులు అంటించి వచ్చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ హర్ట్ అయ్యారు. సిట్ విచారణకు వస్తానని, కానీ, తన గౌరవానికి భంగం కలిగిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే సిట్ విచారణాధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీకి కేసీఆర్ 6 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఆ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. రేపు మ.3 గంటలకు విచారణకు అందుబాటులో ఉంటానని చెప్పారు. కానీ, నంది నగర్ లో అని చెప్పలేదు. నంది నగర్ లోని తన ఇంటి గోడకి నోటీసులు అంటించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోడకు నోటీసులు అంటించమని చట్టంలో ఎక్కడ ఉందని కేసీఆర్ ప్రశ్నించారు.
సిట్ అధికారులు వ్యవహరించిన తీరు చట్టాలకి వ్యతిరేకమని, సుప్రీంకోర్టు తీర్పులను సిట్ అధికారులు తుంగలో తొక్కారని మండిపడ్డారు. సిట్ అధికారులకి నోటీసు ఇచ్చే అధికారమే లేదని, తన రాజ్యాంగ హక్కులను వారు కాలరాస్తున్నారని ఆరోపించారు. తన తదుపరి నోటీసులన్నీ ఎర్రవల్లిలోని తన నివాసానికే పంపాలని చెప్పానని, అయినా సరే గుర్తుతెలియని వ్యక్తులు సిట్ అధికారుల సంతకంతో ఉన్న లేఖను గోడకు అంటించి వెళ్లినట్లు తెలిసిందని లేఖలో పేర్కొన్నారు.
ఆ లేఖ సిట్ అధికారులు పంపినట్లయితే దానిని ఆక్షేపిస్తున్నానని చెప్పారు. సీఆర్పీసీ 160 నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలని, కానీ చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను సిట్ అధికారులు ఉల్లంఘించారని విమర్శించారు. అది కోర్టు ధిక్కరణ అని, ఆ రెండో నోటీసు చట్టబద్ధంగా అందలేదని, అది చెల్లదని చెప్పారు. అంతేకాదు, తాను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ, పొరుగు పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ నివసించడం లేదని, నోటీసు ఇచ్చే సమయానికి వ్యక్తి నివసిస్తున్న ప్రదేశం ముఖ్యమని తెలిపారు.
ఎలక్షన్ అఫిడవిట్ లో నంది నగర్ అడ్రస్ ఉందని చెబుతున్నారని, కానీ, కొన్ని సంవత్సరాలుగా ఎర్రవల్లిలో తాను నివసిస్తున్నాను అన్నది నిర్వివాద అంశమని గుర్తు చేశారు. అక్కడే తన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని కోరారు.
హరీష్ రావు ఎన్నికల అఫిడవిట్ లో సిద్దిపేట చిరునామా ఉన్నా…హైదరాబాద్ లో నోటీసులిచ్చారని గుర్తు చేశారు. మరి, హరీశ్ రావు విషయంలో కేసీఆర్ లాజిక్, ఆ లేఖపై సిట్ అధికారుల స్పందన ఏంటి? ఆయనను ఎర్రవెల్లిలోనే విచారణ జరుపుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
This post was last modified on January 31, 2026 8:39 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…