ఆ హీరోయిన్ పక్కన ఓ హీరో ఉన్నాడు. ఆ హీరోతో చేసిన సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. దాని ప్రమోషన్లలోనే కూర్చుని ఉన్న కథానాయికను.. మీరు ఇప్పటిదాకా పని చేసిన హీరోల్లో ది బెస్ట్ ఎవరు అంటే సమాధానం చెప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది. కొందరు మొహమాటానికి పక్కనున్న హీరో పేరు చెప్పేస్తారు. కొందరేమో అందరూ ఇష్టమే, పర్టికులర్‌గా ఒకరంటూ ఎవరూ లేరు అని సమాధానం దాటవేస్తారు.
కానీ మృణాల్ ఠాకూర్ మాత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ పక్కన కూర్చుని.. తన ఫేవరెట్ కోస్టార్ దుల్కర్ సల్మాన్ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘సీతారామం’లో ఆమె దుల్కర్‌తో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్ద హిట్ కాగా.. సీత పాత్రలో మృణాల్ గొప్ప పేరు సంపాదించింది.
ఐతే ‘సీతారామం’ చేసేటపుడు తాను చాలా కంగారు పడ్డానని.. తెలుగు భాష రాక కొన్నిసార్లు ఏడ్చేదాన్నని మృణాల్ చెప్పింది. అలాంటి టైంలో తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చి.. ఆ సినిమాను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయడంలో తనకు సహకరించింది దుల్కరే అని మృణాల్ చెప్పింది. దుల్కర్ తనకు బెస్ట్ కోస్టార్ మాత్రమే కాదని.. అతనొక బెస్ట్ ఫ్రెండ్, మెంటార్, ఇన్‌స్పిరేషన్.. అంటూ కొనియాడింది మృణాల్.
నిజానికి తాను ‘సీతారామం’ చేస్తున్నపుడు అదే తన చివరి తెలుగు సినిమా కావచ్చని అనుకున్నానని.. భాష రాకపోవడం వల్లే మళ్లీ ఇక్కడ నటించనని కూడా దుల్కర్‌తో చెప్పానని.. కానీ అతను మాత్రం అలా ఏమీ అనుకోవద్దని చెప్పి, ఇక్కడే చాలా సినిమాలు చేస్తావని ప్రోత్సహించాడని.. నిజంగానే తెలుగు ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రేమ పొందిన తాను ఇక్కడ మరిన్ని మంచి సినిమాలు చేస్తున్నానని మృణాల్ చెప్పింది.
This post was last modified on April 6, 2024 10:02 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…