రామ్ చరణ్ 16 లాంచ్ లో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ బుచ్చిబాబు తన శిష్యుడే అయినప్పటికీ రెండో సినిమాకు అతను ఊహించుకున్న కాన్వాస్ తనకు షాక్ ఇచ్చిందని చెప్పిన సంగతి తెలిసిందే. చరణ్ ని హీరోగా కోరుకోవడం, ఏఆర్ రెహమాన్ ని ఒప్పించడం లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే ఆర్సి 16 కు సంబంధించిన పనులను చూస్తే బుచ్చిబాబు నిజంగా అసాధ్యుడే అనిపిస్తుంది. ముఖ్యంగా క్యాస్టింగ్ విషయంలో. ఆల్రెడీ సంజయ్ దత్ ని విలన్ పాత్రకు ఒప్పించాడనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా తిరుగుతోంది.
తాజాగా తాత పాత్ర కోసం ఏకంగా అమితాబ్ బచ్చన్ తోనే ఎస్ చెప్పించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాడట. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడి చేస్తున్న బిగ్ బి సౌత్ నుంచి వచ్చే ఆఫర్లను నిశితంగా వడబోత చేసి మరీ ఎంచుకుంటున్నారు. సైరా నరసింహారెడ్డి తర్వాత టాలీవుడ్ స్క్రీన్ మీద కనిపించలేదు. అయితే బుచ్చిబాబు చెప్పిన పాయింట్ నచ్చడంతో సానుకూలంగా ఉన్నట్టు వినిపిస్తోంది. పక్కా తెలుగు నేటివిటీ అయినప్పటికీ జాన్వీ కపూర్, సంజయ్ దత్, అమితాబ్ బచ్చన్ ఇలా లిస్టు చూస్తూ ఉంటే ఇది బాలీవుడ్ మూవీనేమో అనే అనుమానం కలగక మానదు.
ఇక్కడితో అయిపోలేదు. తారాగణం భారీగా అవసరం ఉండటంతో దానికి అనుగుణంగానే ఎంత ఖర్చయినా పర్వాలేదు ఎవరినయినా తీసుకోమని నిర్మాతలు స్వేచ్ఛ ఇవ్వడంతో బుచ్చిబాబు రాజీ అనే మాట దగ్గరికి రానివ్వడం లేదట. శివరాజ్ కుమార్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఎలివేషన్ ఆ మధ్య జోరుగా తిరిగింది. హిందీ, కన్నడ నుంచి స్టార్ యాక్టర్స్ ని తీసుకున్న బుచ్చిబాబు నెక్స్ట్ తమిళం, మలయాళం నుంచి కూడా ఒకరిద్దరిని తెచ్చుకుంటాడట. పెద్ది టైటిల్ ప్రచారంలో ఉంది కానీ టీమ్ కన్ఫర్మ్ చేయడం లేదు. గేమ్ ఛేంజర్ విడుదల తర్వాతే దీని అప్డేట్స్ మొదలవుతాయి.
This post was last modified on April 5, 2024 8:29 am
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్‌ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…