విజయ్ దేవరకొండ గతంలో ఎంత అగ్రెసివ్‌గా ఉండేవాడో తెలిసిందే. మీడియా ఇంటర్వ్యూల్లో తన సినిమాల గురించి ఒక రేంజిలో మాట్లాడేవాడు. ముఖ్యంగా ‘లైగర్’ మూవీ గురించి విజయ్ మాటలు కోటలు దాటిపోయాయి. ఈ సినిమా కలెక్షన్ విషయంలో తన కౌంట్ రూ.200 కోట్ల నుంచి మొదలవుతుందని విజయ్ అన్న మాటలు.. రిలీజ్ తర్వాత ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయాయి.
గతంలోనూ కొన్ని డిజాస్టర్ మూవీస్ గురించి విజయ్ గొప్పలు పోవడం.. తర్వాత అవి బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనిపించడం జరిగాయి. అప్పుడు నెటిజన్లు కొంచెం లైట్ తీసుకున్నారు కానీ.. లైగర్ టైంలో మాత్రం ట్రోలింగ్ ఒక రేంజిలో జరిగింది. ఆ ప్రభావం విజయ్ మీద కూడా గట్టిగానే పడినట్లుంది. ‘లైగర్’ ఫలితం తర్వాత ఇకపై రిలీజ్ ముంగిట తన సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ వెల్లడించాడు.
‘లైగర్‌కు ముందు, తర్వాత నా వైఖరిలో పెద్దగా మార్పేమీ లేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త పడుతున్నా. విడుదలకు ముందే సినిమా ఫలితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా. ఆ రోజు నుంచి అదే ఫాలో అవుతున్నా. ఇది నాకు నేను వేసుకున్న శిక్ష’ అని విజయ్ వెల్లడించాడు.
ఇక తన కొత్త చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ గురించి మాట్లాడుతూ.. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌కు కూడా బాగా కనెక్ట్ అవుతుందని విజయ్ చెప్పాడు. ఈ సినిమా కథ వినగానే తనకు తన తండ్రే గుర్తుకొచ్చాడని.. తమ కుటుంబంలో ఆయన స్టార్ అని.. కుటుంబ బాధ్యతను మీద వేసుకుని కష్టపడే వాళ్ల గురించే ఈ సినిమా అని విజయ్ చెప్పాడు. కథ వినగానే తన తండ్రి గుర్తుకు రావడం వల్లే తనే అడిగి మరీ ఈ సినిమాలో లీడ్ రోల్‌కు తన తండ్రి పేరు పెట్టించినట్లు విజయ్ వెల్లడించాడు.
This post was last modified on April 2, 2024 3:27 pm
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…