‘ఆర్‍ఆర్‍ఆర్’ షూటింగ్ ఎంత త్వరగా మొదలు పెడితే అంత త్వరగా ఎన్టీఆర్, చరణ్ ఫ్రీ అవుతారు. వాళ్ల మిగతా సినిమాలు చేసుకుంటారు. అలాగే ఈ సినిమా షూటింగ్ ఎంత వేగంగా పూర్తి చేయగలిగితే అంత త్వరగా విడుదల చేసుకునే వీలుంటుంది. అందరికంటే ముందే షూటింగ్ మొదలు పెట్టేయాలని అనుకున్న రాజమౌళి ఇంకా ఆర్.ఆర్.ఆర్.ని తిరిగి పట్టాలెక్కించలేదు. చాలా సినిమాల షూటింగ్స్ మొదలైపోయినా కానీ రాజమౌళి సినిమా మాత్రం ఇంకా వెయిటింగ్‍లోనే వుంది.
షూటింగ్ మొదలు పెట్టిన సినిమాలకు పదిహేను నుంచి ముప్పయ్ మంది క్రూ సభ్యులే వున్నారు కాబట్టి కుదురుతోంది. కానీ ఆర్.ఆర్.ఆర్. షూటింగ్‍కి మినిమం మూడొందల మంది క్రూ వుంటారు. ఇక జూనియర్ ఆర్టిస్టుల అవసరం పడితే ఆ సంఖ్య వేలల్లో వుంటుంది. యాభై మంది బృందంతో షూటింగ్ చేసేయవచ్చునని అనుకున్న రాజమౌళి అది ఇంత స్కేల్ వున్న సినిమాకు కుదరని పని అని గ్రహించాడు.
మరి అంత మంది కలిసి పని చేస్తే ఈ టైమ్‍లో కరోనా సోకే ప్రమాదం చాలా ఎక్కువ. తొందరపడి సెట్స్ కి వెళ్లిపోయి ఎవరైనా కరోనా బారిన పడ్డారని న్యూస్ వస్తే షూటింగ్ మొత్తానికే ఆపేయాల్సి వస్తుంది. మరి తక్కువ బృందంతో షూటింగ్ చేయగలరా లేదా? ఎన్టీఆర్ సోలో సీన్స్ అన్నీ ముందు తీసేయాలని, తర్వాత కాంబినేషన్ సీన్స్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడు. కానీ షూటింగ్ మళ్లీ మొదలయ్యేదెప్పుడు?
This post was last modified on September 14, 2020 8:46 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…