మెగా కుర్రాడు వరుణ్ తేజ్‌కు ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్-2 లాంటి విజయాలతో ఒకప్పుడు మంచి ఊపు మీద కనించాడతను. కానీ గత రెండేళ్లలో అతను చేసిన సినిమాలన్నీ దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. ఉన్నంతలో ‘ఎఫ్-3’ కొంచెం బెటర్.
సోలో హీరోగా చేసిన గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో అతడి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఒక్కసారిగా కరిగిపోయిన భావన కలుగుతోంది. తన కొత్త చిత్రాలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ చేస్తున్న సమయంలోనే వరుణ్ ‘మట్కా’ పేరుతో ఓ భారీ చిత్రం చేయడానికి కమిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆది నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది.
డిజిటల్ మార్కెట్ బాగా దెబ్బ తింటున్న సమయంలో ఈ సినిమా ఓకే అయింది. బడ్జెట్ దాదాపు 60 కోట్లు అనుకున్నారు. ఐతే డిజిటల్ హక్కుల ధరలు బాగా తగ్గిపోవడంతో 20 కోట్లు తగ్గించి 40 కోట్లలో తీయాలనుకున్నారు. ఈలోపు వరుణ్‌కు రెండు డిజాస్టర్లు పడ్డాయి. దీంతో 40 కోట్లతో కూడా సినిమా వర్కవుట్ అవుతుందా అన్న సందేహాలు కలిగాయి. ఇంతలో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయాల్సిన వైరా ఎంటర్టైన్మెంట్స్‌లో ఒక భాగస్వామి దూరం అయ్యారు. మోహన్ చెరుకూరి ఒక్కరే మిగిలారు. ఆయన ఒక్కరే ఇంత రిస్క్ చేయడానికి సిద్ధంగా లేరు. ఆయన మరో భాగస్వామి కోసం చూస్తున్నారు.
వరుణ్ మార్కెట్ దెబ్బ తినడం, దర్శకుడు కరుణ్ కుమార్ కమర్షియల్‌గా వర్కవుటయ్యే సినిమా తీయగలడా అనే విషయంలో సందేహాలుండడం, నిర్మాణ పరంగా ఉన్న ఇబ్బందులు.. ఇవన్నీ కలిసి ‘మట్కా’ మీద నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. మరి ఈ అడ్డంకులన్నీ దాటి సినిమా ముందుకు వెళ్తుందో లేదో చూడాలి.
This post was last modified on April 1, 2024 5:43 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…