‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ ముంగిట తీరిక లేకుండా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఐతే ఓ ఇంటర్వ్యూలో కొత్త దర్శకులతో పని చేయనంటూ అతను ఇచ్చిన స్టేట్మెంట్ వివాదాస్పదం అయింది. ‘పెళ్లి చూపులు’ సినిమాతో విజయ్‌కి ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది కొత్త దర్శకుడైన తరుణ్ భాస్కర్. ఆపై ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది కూడా డెబ్యూ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ. మరో కొత్త దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కూడా ‘ట్యాక్సీవాలా’తో విజయ్‌కి మంచి విజయాన్నందించాడు.
అలాంటిది ఇప్పుడు తాను కొత్త దర్శకులతో పని చేయనని.. వాళ్లు బడ్జెట్, ఇతర విషయాలను హ్యాండిల్ చేయలేరని.. ఒక్క సినిమాకైనా పని చేసి ఉండాలని విజయ్ చెప్పడం లాజికల్‌గా అనిపించలేదు. అందులోనూ పూరి జగన్నాథ్ లాంటి అనుభవజ్ఞుడైన దర్శకుడితో ‘లైగర్’ లాంటి డిజాస్టర్ ఇచ్చాక విజయ్ ఈ మాట అనడం మరింత విడ్డూరంగా అనిపించింది. దీంతో విజయ్ వ్యాఖ్యల మీద నిన్నట్నుంచి ట్రోలింగ్ నడుస్తోంది.
తాజాగా మీడియాను కలిసిన సందర్భంగా మరోసారి దీని గురించి చర్చ జరిగింది. కొత్త దర్శకులతో పని చేయరని ఎందుకన్నారు అంటూ మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి బదులిస్తూ.. ‘‘కొత్త దర్శకులను నేను బ్లాక్ చేస్తే కొత్త ఆర్టిస్టులకు అవకాశం ఇస్తారు? తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి లాంటి వాళ్లు నాలాంటి కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చి పెద్ద స్థాయికి వెళ్లారు. అలాగే కొత్త దర్శకులు కూడా పేరున్న హీరోలతో కాకుండా కొత్త వాళ్లతో సినిమాలు తీయాలి. కొత్త నటులకు బ్రేక్ ఇవ్వాలి. అలాంటి వాళ్లను నేను బ్లాక్ చేస్తే కొత్త నటులకు ఇంకెవరు అవకాశమిస్తారు’’ అని ప్రశ్నించాడు. కానీ కొత్త దర్శకులందరూ కొత్త వాళ్లతో.. స్టార్ డైరెక్టర్లు స్టార్ నటులతో చేస్తుంటే ఎలా వర్కవుట్ అవుతుంది.. అప్పుడు చిన్న నటులతో పెద్ద డైరెక్టర్లు.. కొత్త దర్శకులతో స్టార్ నటులు సినిమాలే చేయకూడదా.. ఇదేం లాజిక్ అంటూ విజయ్‌పై మరో రౌండ్ ట్రోలింగ్ నడుస్తోంది.
This post was last modified on April 1, 2024 5:43 pm
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ,…
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో…
రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా…