సిద్ధు జొన్నలగడ్డ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ ఈ యువ కథానాయకుడే. ‘డీజే టిల్లు’తో రెండేళ్ల కిందట సెన్సేషన్ క్రియేట్ చేసి.. ఇప్పుడు దాని సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’తో మరింతగా ప్రకంపనలు రేపుతున్నాడీ యువ కథానాయకుడు. ఎన్నో ఏళ్ల పాటు పడ్డ కష్టానికి అతను ఇప్పుడు ఫలితం అందుకుంటున్నాడు. ఒకప్పుడు చిన్న చిన్న పాత్రల కోసం లైన్లో నిలబడ్డ నటుడతను. ఇప్పుడు అతడి డేట్ల కోసం నిర్మాతలు క్యూలో ఉన్నారు.
ఐతే ‘డీజే టిల్లు’తోనే అవకాశాలు వెల్లువెత్తినా.. ఏది పడితే అది ఓకే చేయలేదు సిద్ధు. ‘బుట్టబొమ్మ’ సహా కొన్ని చిత్రాలకు ఓకే అని మళ్లీ వెనక్కి తగ్గాడు. వచ్చిన ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను వృథా చేసుకోకుండా తన కెరీర్‌కు ఉపయోగపడే సినిమాలే చేయాలనుకున్నాడు. ఆ క్రమంలోనే ‘టిల్లు స్క్వేర్’ మీద ఫోకస్ పెంచి.. ఆ తర్వాత నీరజ కోన, బొమ్మరిల్లు భాస్కర్ చిత్రాలను ఓకే చేశాడు.
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశాన్ని కూడా వదులుకున్నాడట సిద్ధు జొన్నలగడ్డ. ఆ సినిమా ఏది అన్నది చెప్పలేదు కానీ.. చిరు సినిమాను వదులుకోవాల్సి వచ్చిన విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అందుకు కాారణం వెల్లడిస్తూ.. ‘‘నేను, చిరంజీవి గారు కలిసి ఒక సినిమా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. మేము ఎప్పుడైనా కలిస్తే ఆ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. చిరంజీవిగారు ఒక సూపర్ హ్యుమన్. తెలుగు ఇండస్ట్రీ అంటే మొదటగా గుర్తుకొచ్చేది ఆయన పేరే. మా చిన్నప్పడు చిరంజీవిగారు, బాలకృష్ణ గారు ఆకాశంలో తారల్లా కనిపించేవారు. అలాంటి తారలతో కలిసి నటించే అవకాశం వస్తే అది బెస్ట్ ప్రాజెక్ట్ అవ్వాలి. అవుటాఫ్ వరల్డ్ అయ్యుండాలి. నా పిల్లలకు ‘‘నేను చిరంజీవిగారితో పనిచేశాను’’ అని గర్వంగా చెప్పుకోవాలి. అది నా జీవితంలో ఒక మైల్‌స్టోన్‌గా మిగిలిపోతుంది. దేవుడి దయ ఉంటే ఏదో ఒక రోజు నాకు ఆ అవకాశం వస్తుంది. ఎవరో ఒక డైరక్టర్ ఒక కథ చెప్పి, అది ఆయనకు నచ్చి, ఆయన అంగీకరించే రోజు వస్తుంది. అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నా’’ అని సిద్ధు అన్నాడు.
This post was last modified on April 1, 2024 1:54 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హీరో అల్లు అర్జున్ ప్రకటించిన సంగతి…
ఉపేంద్ర యుఐ కోసం అయిదు రోజులు ఆగి విడుదలవుతున్న సినిమా మ్యాక్స్. ఈగతో మనకు విలన్ గా పరిచయమై బాహుబలి,…
తండ్రి ఒకప్పుడు నెంబర్ వన్ సూపర్ స్టార్, మరోవైపు అన్న మినిమమ్ హిట్స్ అందుకుంటున్నాడు. కానీ తమ్ముడు మాత్రం ఒకప్పుడు…
కెరీర్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీగా కంగువ మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సూర్యకి అది కోలీవుడ్…
మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. మాట తీరు ఆచితూచి ఉన్నా..…