ఇప్పుడు తెలుగు ప్రేక్షకులే కాక దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్స్‌లో ‘జై హనుమాన్’ ఒకటి. ఈ సంక్రాంతికి ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన ‘హనుమాన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ సినిమా రేంజికి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం అన్నది అసామాన్యమైన విషయం.
సూపర్ హీరో అంటే హాలీవుడ్ సినిమాల వైపే చూడాల్సిన పని లేదని.. మన పురాణాల్లోనే హనుమంతుడి లాంటి అద్భుతమైన పాత్రలు ఉన్నాయని.. వాటిని సరిగ్గా వాడుకుంటే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరుగుతాయని ఈ సినిమా రుజువు చేసింది. ‘హనుమాన్’ చూసిన ప్రతి ఒక్కరూ దీని సీక్వెల్ ‘జై హనుమాన్’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వేరే దర్శకుల్లాగా ఎక్కువ టైం తీసుకోకుండా ‘జై హనుమాన్’ పనులను వెంటనే మొదలుపెట్టేశాడు ప్రశాంత్ వర్మ. స్క్రిప్టు రెడీ చేసి ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయాడు. ఈ ఉగాదికి ‘జై హనుమాన్’ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ దిశగా ఇప్పటికే హింట్ ఇచ్చిన ప్రశాంత్.. తాజాగా ఒక చిన్న వీడియో షేర్ చేశాడు. దానికి ‘అంజనాద్రి 2.0’ అని క్యాప్షన్ జోడించాడు.
‘హనుమాన్’లో చూపించిన అంజనాద్రి’తో పోలిస్తే ఇది ఇంకా బ్యూటిఫుల్‌గా, గ్రాండ్‌గా అనిపిస్తోంది. ‘జై హనుమాన్’ కథ ప్రధానంగా ఇక్కడే సాగబోతోందన్న సంకేతాలు ఇచ్చాడు ప్రశాంత్. పరిమిత బడ్జెట్లోనే అద్భుతమైన ఔట్ పుట్ చూపించిన ప్రశాంత్.. ఈసారి భారీ బడ్జెట్లో మరింత గ్రాండియర్‌గా విజువల్స్ చూపించబోతున్నాడని తెలుస్తోంది.
This post was last modified on April 1, 2024 1:46 pm
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…