Categories: Movie News

అమెరికాలో టిల్లు ప్రకంపనలు

తెలుగు ప్రేక్షకులందు అమెరికన్ ఎన్నారై తెలుగు ఆడియన్స్ వేరు. వాళ్లు ఎప్పుడు ఏ సినిమాకు పట్టం కడతారో అర్థం కాదు. కొన్నిసార్లు పెద్ద స్టార్ల సినిమాలను కూడా పట్టించుకోరు. అదే సమయంలో చిన్న హీరోలు నటించిన చిత్రాలకు కూడా భారీ వసూళ్లు కట్టబెడతారు. సంక్రాంతి టైంలో ‘గుంటూరు కారం’ను లైట్ తీసుకుని ‘హనుమాన్’ సినిమాకు భారీ వసూళ్లు అందించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే ట్రెండ్ నడిచినా.. అక్కడ అంతరం చాలా ఎక్కువ ఉంది.

సంక్రాంతి తర్వాత యుఎస్‌లో ‘గామి’ అనే చిన్న సినిమా మినహా ఏదీ పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ మూవీకి అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రానికి ముందు నుంచి క్రేజ్ ఉన్న మాట వాస్తవమే కానీ.. ప్రిమియర్స్ దగ్గర వచ్చిన రెస్పాన్స్ మాత్రం అసాధారణం. ఏకంగా 4 లక్షల డాలర్లకు పైగా ప్రిమియర్ కలెక్షన్లు అంటే మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద స్టార్లకు మాత్రమే ఈ స్థాయిలో ప్రిమియర్ వసూళ్లు వస్తుంటాయి. ఇక తొలి రోజు సైతం ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఎగబడ్డారు. దీంతో ప్రిమియర్స్, డే-1 వసూళ్లు కలిపి మిలియన్ డాలర్ల మార్కును టచ్ చేసింది ఈ చిత్రం. ‘టిల్లు స్క్వేర్’ సినిమా స్థాయికి ఇది చాలా పెద్ద నంబర్.

వీకెండ్లో దూకుడు కొనసాగిస్తున్న ‘టిల్లు స్క్వేర్’ 2 మిలియన్ మార్కును టచ్ చేయడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. మిడ్ రేంజ్ మూవీస్‌లో అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలవబోతోంది ‘టిల్లు స్క్వేర్’. ఇక ఈ చిత్రం ఓవరాల్‌గా వీకెండ్ అయ్యేసరికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్కును దాటేయబోతోంది. బయ్యర్లందరూ భారీ లాభాలు ఖాతాలో వేసుకోబోతున్నారు.

This post was last modified on March 31, 2024 8:43 pm

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

6 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

1 hour ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago