మొన్నటిదాకా టాప్ డిమాండ్ లో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే విపరీతంగా నెమ్మదించేసింది. చేతి దాకా వచ్చిన గుంటూరు కారం కొంత షూటింగ్ అయ్యాక మిస్ కాగా, సాయి దుర్గ తేజ్ తో మొదటిసారి జోడి కట్టాలనుకున్న గాంజా శంకర్ ఉంటుందో లేదో తెలియని అయోమయం నెలకొంది. ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తున్న బుట్టబొమ్మ త్వరలో నాగ చైతన్యతో నటించవచ్చని ఫిలిం నగర్ టాక్. విరూపాక్షతో బ్లాక్ బస్టర్ డెబ్యూ అందుకున్న కార్తీక్ దండు త్వరలో చైతుతో ఒక మూవీ ప్లాన్ చేసుకున్న సంగతి ఆల్రెడీ లీకయ్యింది. అధికారికంగా ప్రకటించడమే తరువాయి.
నాగ చైతన్య, పూజా హెగ్డేలు తెరను పంచుకోవడం ఇది మొదటిసారి కాదు. 2014 ఒక లైలా కోసంలో తెరమీద ప్రేమించుకున్నారు. అప్పటికి ఇద్దరికీ స్టార్ స్టేటస్ లేదు. ముకుంద ఫ్లాప్ కన్నా ముందు పూజాకు వచ్చిన ఆఫర్ ఇది. అయితే సినిమా ఆశించిన విజయం అందుకోకపోవడంతో గుర్తింపు రాలేదు. కట్ చేస్తే ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని డీజే దువ్వాడ జగన్నాథంతో మొదటి బ్రేక్ దక్కించుకుంది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసే అవకాశం రాలేదు. ఇప్పుడు మళ్ళీ దశాబ్దం తర్వాత కాంబో రిపీట్ కావడం అంటే సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు.
ప్రస్తుతానికి అఫీషియల్ కాలేదు కాబట్టి ప్రచారంలో ఉన్న వార్తగానే చూడాలి. తండేల్ షూటింగ్ లో బిజీగా ఉన్న చైతు అది పూర్తయ్యేవరకు వేరే ప్రాజెక్టు మొదలుపెట్టే మూడ్ లో లేడు. అక్టోబర్ లో విడుదల చేయాలని గీత ఆర్ట్స్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్రీకరణ వేగమందుకుంది. దర్శకుడు చందూ మొండేటి నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో స్పీడ్ పెంచాడు. ఈలోగా కార్తీక్ దండుతో సినిమా గురించి అనౌన్స్ మెంట్ రావొచ్చేమో కానీ షూట్ మాత్రం వేసవి తర్వాత ఉంటుంది. చూడాలి మరి ఒక లైలా కోసం పెయిర్ మరోసారి స్క్రీన్ మీద కనిపిస్తారో లేదో.
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…