అల్లు అర్జున్ కెరీర్ ని గొప్ప మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ గా ఆర్య తనకే కాదు డెబ్యూ చేసిన దర్శకుడు సుకుమార్ కి, అభిమానులకు ఎంతో స్పెషల్ గా నిలిచిపోయింది. గంగోత్రిలో లుక్స్, నటన గురించి కామెంట్ చేసిన వాళ్లకు బన్నీ రెండో చిత్రంతోనే బదులు చెప్పడం చిన్న విషయం కాదు. రాబోయే మే 7 ఈ క్లాసిక్ లవ్ స్టోరీకి 20వ వార్షికోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున రీ యూనియన్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. నిన్న లవ్ మీ సాంగ్ లాంచ్ లో ప్రకటించేశారు. ఆర్య 2 ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదనే సంగతి తెలిసిందే.
అంతగా ఆడకపోయినా బన్నీ క్యారెక్టరైజేషన్, దేవిశ్రీ ప్రసాద్ పాటలకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్య 3 ప్రకటన ఏమైనా రావొచ్చనే అంచనాలు అభిమానుల్లో మొదలయ్యాయి. వాస్తవిక కోణంలో దానికి ఛాన్స్ లేదని చెప్పాలి. ఎందుకో చూద్దాం. పుష్ప 2 ది రూల్ ఆగస్ట్ లో రిలీజయ్యాక అల్లు అర్జున్ లిస్టులో అట్లీ, త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా ఉన్నారు. వీళ్ళలో ఎవరిది ముందు ఉంటుందో ఇంకా స్పష్టత లేదు. పుష్ప 3 గురించి ప్రచారాన్ని టీమ్ కొట్టిపారేయడం లేదు కనక థర్డ్ పార్ట్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఎలా చూసుకున్నా అల్లు అర్జున్ ఇంకో నాలుగేళ్లు బిజీనే.
మరి ఆర్య 3 ఆ తర్వాత చేయాలంటే బాగా ఆలస్యమవుతుంది. ఆమాంతం పెరిగిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ముందు ఆర్య లాంటి లవర్ బాయ్ పాత్రలు బన్నీకి ఇప్పుడంతగా నప్పవు. పైగా సుకుమార్ కూడా రామ్ చరణ్ 17తో ఇంకో అయిదారు నెలల్లో బిజీ అయిపోతాడు. సో ప్రాక్టికల్ గా చూస్తే ఎక్కడ ఛాన్స్ కనిపించడం లేదు. సుక్కుతో చేయడాన్ని బన్నీ ఎప్పుడూ ఇష్టపడతాడు. దాంట్లో సందేహం లేదు. అలా అని రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ప్రేమకథకు కొనసాగింపంటే ఇద్దరూ అంత తేలిగ్గా నిర్ణయం తీసుకోరు. మేలో ఆర్యనే గ్రాండ్ గా 4కెలో రీ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు దిల్ రాజు.
This post was last modified on March 31, 2024 12:34 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……