న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి చేతులు కలిపారు. ఇది గతంలోనే లీకైన న్యూస్ అయినప్పటికీ ఇవాళ ప్రీ లుక్ రూపంలో అధికారిక ముద్ర వేశారు. విప్లవం ప్రారంభం కాకముందే హింస సరైన దారిని ఎంచుకుందనే క్యాప్షన్ తో ఆసక్తి రేపేలా పోస్టర్ వదిలారు. ఈ మధ్య ప్రచారం జరిగినట్టు ఇది దసరా 2 కాదని ఆఫ్ ది రికార్డు యూనిట్ నుంచి అందుతున్న సమాచారం. శ్రీకాంత్ పూర్తిగా కొత్త కథను రాసుకున్నాడని, కాకపోతే దసరాని మించిన మోతాదులో హింస ఉంటుందని, నానికి ఇచ్చే ఎలివేషన్లు కూడా అదే స్థాయిలో మెప్పిస్తాయని అంటున్నారు.
ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు కానీ నాని మొదటిసారి మాస్ లీడర్ గా ఇందులో దర్శనమివ్వబోతున్నాడు. నేపధ్యం 80, 90ల నాటిదే ఉంటుందని సమాచారం. దసరా తర్వాత పెరిగిన కమర్షియల్ ఇమేజ్ ని క్యాష్ చేసుకునేందుకు నాని పరుగులు పెట్టలేదు. దానికి పూర్తి భిన్నమైన హాయ్ నాన్న లాంటి ఎమోషనల్ డ్రామాని ఎంచుకుని సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు చేస్తున్న సరిపోదా శనివారంలో ఊహించని సబ్జెక్టుతో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో రాబోతున్నాడు. సుజిత్ తో అనౌన్స్ చేసిన ప్యాన్ ఇండియా మూవీలో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ ఉండబోతోంది. సో సాఫ్ట్ పాత్రలకు బ్రేక్ ఇచ్చినట్టే.
వచ్చే ఏడాది రిలీజ్ ప్లాన్ చేసుకున్న నాని శ్రీకాంత్ ఓదెల సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరంలోనే జరగనుంది. సరిపోదా శనివారం జూలైలో అయిపోతుంది. ఆ తర్వాత ఆగస్ట్ రిలీజ్ వరకు ప్రమోషన్లలో నాని బిజీ అవుతాడు. సుజిత్ అటుపక్క పవన్ కళ్యాణ్ ఓజి ఫినిష్ చేసుకుని రాగానే న్యాచురల్ స్టార్ కు కెమెరా యాక్షన్ చెప్పేస్తాడు. ఇది డిసెంబర్ లేదా జనవరిలోపు కంప్లీట్ చేయాలని టార్గెట్. అక్కడి నుంచి శ్రీకాంత్ ఓదెలకు నాని అందుబాటులోకి వచ్చేస్తాడు. మొత్తానికి నాని ప్లానింగ్ చూస్తుంటే మాస్ అండ్ యాక్షన్ వైపు టర్నింగ్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. మంచిదేగా.
This post was last modified on March 30, 2024 9:24 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…