ఆకాశాన్ని తాకే అంచనాలు లేకపోయినా, వందల కోట్లతో తీసిన గ్రాండియర్ కాకపోయినా టిల్లు స్క్వేర్ మొదటి రోజు ఓపెనింగ్ ఒకరకంగా సునామి అని చెప్పాలి. పది రోజుల క్రితం వరకు చివరి నిమిషం పనుల ఒత్తిడిలో నలిగిన టీమ్ టైం తక్కువగా ఉన్నా సరే ఉన్నంతలో చక్కగా ప్రమోషన్లు చేసుకుని సినిమాను థియేటర్లకు తీసుకొచ్చారు. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన ప్రకారమే మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 23 కోట్ల 70 లక్షలు. ట్రేడ్ లెక్కల్లో కొంచెం హెచ్చు తగ్గులుండొచ్చేమో కానీ ఫైనల్ గా చూసుకుంటే ఫిబ్రవరి నుంచి భారీ జోష్ కోసం ఎదురు చూసిన బాక్సాఫీస్ కు టిల్లు ఊపిరి ఊదాడు.
ఏరియాల వారిగా కూడా రికార్డులు నమోదవుతున్నాయి. యుఎస్ ఈ వారం పూర్తయ్యేలోపే సులభంగా 2 మిలియన్ మార్క్ అందుకుంటుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్ 2 కోట్లకు పైగానే నమోదు కావడం బట్టి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నైజాం హక్కులను సుమారు ఏడు కోట్లకు కొనుగోలు చేసిన దిల్ రాజుకు సోమవారం లోపే ఆ మొత్తం షేర్ గా అందుతుందని టాక్. గుంటూరు కారం డీల్ లో భాగంగా ఆయనకు ఈ రేట్ దక్కిందని వినికిడి. సో రికవరీ శాతం ఊహలకు అందని విధంగా ఉండబోతోంది.
బిసి సెంటర్లలోనూ ఇదే తరహాలో టిల్లు స్క్వేర్ దూకుడు చూపిస్తున్నాడు. గత వారం రిలీజైన ఓం భీమ్ బుష్, గురువారం వచ్చిన ది గోట్ లైఫ్ ఆడు జీవితంలు దీంతో పోటీ పడలేని పరిస్థితిలో ఉండగా, కాంగ్ ఎక్స్ గాడ్జిల్లా ది న్యూ ఎంపైర్ మాత్రమే యూత్, పిల్లల సహాయంతో మంచి నెంబర్లు నమోదు చేసింది. మీడియం రేంజ్ సినిమాల్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ పరంగా దసరా, ఖుషిలను దాటే అవకాశముందని అంటున్నారు కానీ షేర్లు ఖరారైతే తప్ప దీన్ని నిర్ధారణగా చెప్పలేం మొత్తానికి అదిరిపోయే ఆరంభంలో మార్చిని ఘనంగా ముగించిన టిల్లు స్క్వేర్ ఇంకెన్ని సంచలనాలు రేపుతుందో.
This post was last modified on March 30, 2024 10:32 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…