Movie News

టిల్లుగాని పంచులు.. ఏం రాసిండ్రు బై

మొత్తానికి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. వాయిదాల మీద వాయిదాలు పడి శుక్రవారం రిలీజైంది. ‘డీజే టిల్లు’ రిలీజ్ టైంలో కంటే.. ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా పోను పోను టిల్లు పాత్ర ప్రేక్షకులకు బాగా ఎక్కేసి ‘టిల్లు స్క్వేర్’ మీద అంచనాలు భారీగా పెంచేసింది. అందుకేేనేమో సీక్వెల్ మేకింగ్‌ మీద సిద్ధు అండ్ కో ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఈసారి ఎంటర్టైన్మెంట్ డోస్ ఏమాత్రం తగ్గినా.. ప్రేక్షకులు నిరుత్సాహపడతారని టీం బాగా కసరత్తు చేసింది.

దాని ఫలితం సినిమాలో బాగానే కనిపించింది. ‘డీజే టిల్లు’లో సిద్ధు టిపికల్ డైలాగ్ డెలివరీతో చెప్పిన వన్ లైనర్ డైలాగ్సే దానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రీల్స్, ట్రెండ్స్‌లో వైరల్ అయినవి కూడా ఆ వన్ లైనర్సే. ‘టిల్లు స్క్వేర్’లో కూడా వందల కొద్దీ వన్ లైనర్స్ పెట్టాడు సిద్ధు జొన్నలగడ్డ. డైలాగుల్లో ఎక్కడా పంచ్ తగ్గకుండా చూసుకున్నాడు. వాటిని తనదైన శైలిలో పలుకుతూ ప్రేక్షకులను నాన్ స్టాప్‌గా నవ్వించాడు సిద్ధు.

సింపుల్‌గా అనిపిస్తూనే.. మంచి ఫన్ జనరేట్ చేసే డైలాగులు ఇందులో కోకొల్లలు. సినిమాలో రాధికగా రీఎంట్రీ ఇచ్చి కాసేపు మెరిసే నేహా శెట్టి తనని మొక్కుబడిగా కుశల ప్రశ్నలు అడుగుతుంటే.. ‘‘ఎయిర్ హోస్టెస్, కాల్ సెంటర్ అమ్మాయి లాగా బేసిక్ హోటల్ మేనేజ్మెంట్ క్వశ్చన్స్ అడక్కు ప్లీజ్’’ అనడం.. ఆ పాత్ర గురించి హెచ్చరిస్తూ.. ‘‘అందంగా ఉందని గోకొద్దు. అమాంతం మింగేసి అస్థిపంజరం బయటికి తీస్తది’’.. ‘‘నల్లచీర: ఎ ఫిల్మ్ బై రాధిక. చాలా పెద్ద డైరెక్టర్. కథలు మస్తు చెప్తది’’ అంటూ రాధిక పాత్ర గురించి రాసిన డైలాగులు మామూలుగా పేలలేదు.

అవే కాక తండ్రితో సిద్ధు సంభాషణలు కూడా భలేగా నవ్వించాయి. ఆయన ఫైల్స్ కంప్లైంట్‌తో డాక్టర్ దగ్గరికి పోతే.. ‘‘మైదా పిండి చుట్టూ నీ పేగులున్నయా.. పేగుల చుట్టూ మైదా పిండి ఉందా’’.. ‘‘ఒక పైప్ లోపలికి పంపించి నీ మైదా ఉద్యమ ాన్ని 4కేలో చూపిస్తరు’’ లాంటి డైలాగులు బాగా పేలాయి. సినిమా నిండా ఇలా పంచ్ డైలాగులుండడంతో వీక్‌గా ఉన్న కథ గురించి పెద్దగా పట్టించుకోకుండా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు.

This post was last modified on March 29, 2024 3:57 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

2 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

7 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

9 hours ago