కొన్ని నెలల క్రితం ప్రకటించి అసలు షూటింగ్ జరుగుతుందో లేదోననే తరహాలో మౌనం పాటించిన ప్రతినిథి 2 ఇవాళ హఠాత్తుగా టీజర్ రూపంలో వచ్చి ఆశ్చర్యపరిచాడు. సరిగ్గా పదేళ్ల క్రితం విడుదలైన ప్రతినిథి నారా రోహిత్ కు నటన పరంగానే కాకుండా కమర్షియల్ గానూ మంచి విజయం అందించింది. దానికి కొనసాగింపు కాకపోయినా దాని ఛాయలు కనిపించేలా సీక్వెల్ ని రూపొందించడం ఒక విశేషమైతే దర్శకుడిగా ప్రముఖ యాంకర్ టీవీ5 మూర్తి దీని ద్వారానే డెబ్యూ చేయడం మరో ఆకర్షణ. ఊహించని క్వాలిటీ, కంటెంట్ తో ఒకరకంగా షాక్ ఇచ్చారనే చెప్పాలి.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ అజెండా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. వాటిలో వ్యక్తిగత ఉద్దేశాలు ఎక్కువగా ఉండటంతో జనం ఆదరించడం లేదు. భారీ బడ్జెట్ లో తీసిన థియేట్రికల్ మూవీ అయినా ఓటిటిలో వచ్చిన చిన్న చిత్రమైనా ఒకే ఫలితం వస్తోంది. కానీ ప్రతినిథి 2 ఆ కోవలోకి రావడం లేదు. వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూ, ఓటు విలువను తెలియజేస్తూ, సినిమాటిక్ ఫార్మాట్ లో రూపొందించినట్టు కనిపిస్తోంది. అయిదు లక్షల కోట్లు అప్పు తీర్చాలంటే అభివృద్ధి జరగాలని ఒక మంత్రి చెబితే అసలు అభివృద్ధి ఎక్కడుందని జర్నలిస్టు ప్రశ్నించడం బాగుంది.
ఏప్రిల్ లో విడుదల కాబోతున్న ప్రతినిధి 2లో నారా రోహిత్ మునుపటి లుక్ లో ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చగా జిస్సు సేన్ గుప్తా, అజయ్ ఘోష్ తదితరుల సీనియర్ క్యాస్టింగ్ పెద్డదే కనిపిస్తోంది. హీరోయిన్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జొప్పించినట్టు లేరు. పూర్తిగా కల్పిత కథ కాబట్టి సెన్సార్ ఇబ్బందులు వచ్చే అవకాశాలు తక్కువే. బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న నారా రోహిత్ ప్రతినిథి 2 మీద గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. పాత్రికేయంలో సుదీర్ఘ అనుభవమున్న మూర్తి క్లిష్టమైన కంటెంట్ ని ఎలా హ్యాండిల్ చేశారో చూడాలి.
This post was last modified on March 29, 2024 3:29 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…