తెలుగు వెర్షన్ మీద ప్రత్యేక శ్రద్ధతో రోజుల తరబడి హైదరాబాద్ లోనే ఉండి ప్రమోషన్లు చేసిన పృథ్విరాజ్ సుకుమారన్ కొత్త సినిమా ది గోట్ లైఫ్ ఆడు జీవితం నిన్న థియేటర్లలో విడుదలయ్యింది. 16 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టు మీద పని చేయడమే కాక కథ డిమాండ్ మేరకు తన శరీరాన్ని బరువు పెంచి తగ్గించడం ద్వారా ఎంతో శ్రమను తీసుకున్న పృథ్విరాజ్ దీన్ని తన కలల రూపంగా చెప్పుకున్నారు. కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి గల్ఫ్ లో పడిన కష్టాలను నవలగా తీసుకొస్తే ఆ పుస్తకం అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. దాని ఆధారంగా గోట్ లైఫ్ రూపొందింది. మరి మన ప్రేక్షకులకు మెప్పించేలా ఉందా.
నజీబ్ (పృథ్విరాజ్ సుకుమారన్) జీవనోపాధికి చేస్తున్న వృత్తి సరిపోక కుటుంబం, పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు కోసం ముప్పై వేలు అప్పు చేసి తెలిసిన బ్రోకర్ ద్వారా గల్ఫ్ దేశానికి వెళ్తాడు. అక్కడ కిడ్నాప్ కు గురై ఒక ముఠా చేతికి చిక్కుతాడు. గొర్రెలు కాసే కఠినమైన పనిని నజీబ్ కు పురమాయిస్తారు. తప్పించుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా దొరికిపోయి దెబ్బలు తింటాడు. ఇలా అలవాటు పడుతున్న క్రమంలో హకీమ్(గోకుల్)తో కలిసి పారిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు. అయితే ఇది అనుకున్నంత సులభంగా ఉండదు. ఎన్నో ప్రమాదాలు దాటుకున్నాక చివరికీ ఏమైందనేది తెరమీద చూడాలి.
దర్శకుడు బ్లేస్సి సహజత్వానికి ప్రాధాన్యం ఇవ్వడంతో కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. కంటెంట్ మీద అవగాహనతో ముందుగానే ప్రిపేరయ్యి చూస్తే పృథ్విరాజ్ నటన, ఎడారి వాతావరణం, ఏఆర్ రెహమాన్ నేపధ్య సంగీతం కట్టి పడేస్తాయి. అలా కాకుండా మూడు గంటల నిడివిలో ఎంటర్ టైన్మెంట్ లేదా కమర్షియల్ అంశాలు కోరుకుంటే మాత్రం నిరాశ తప్పదు. ప్రయత్నలోపం లేకుండా అంతర్జాతీయ అవార్డులు సైతం దక్కించుకునే స్థాయిలో హీరో, డైరెక్టర్ పనితనం కనిపిస్తుంది కానీ సగటు వినోదం లేదా మాస్ ఎలిమెంట్స్ కోరుకునే ప్రేక్షకులకు ఈ గోట్ లైఫ్ కొరుకుడుపడదు.
This post was last modified on March 29, 2024 11:15 am
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…