ఇవాళ టిల్లు స్క్వేర్ విడుదలైపోయింది. యుఎస్ ప్రీమియర్స్ నుంచి రెస్పాన్స్ పాజిటివ్ గానే వినిపిస్తోంది. ఇక్కడి టాక్ కీలకం కాబట్టి ఫలితం మీద బయ్యర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్ని వారాలుగా యునానిమస్ గా థియేటర్లకు జనాన్ని రప్పించిన సినిమా హనుమాన్ తర్వాత ఏదీ లేదు. రెండు మూడు బ్రేక్ ఈవెన్ కోణంలో సక్సెస్ అయినప్పటికీ పూర్తి స్థాయి జోష్ ఇవ్వలేకపోయాయి. పైగా రిలీజ్ ముందు హైప్ ఇచ్చినవి కూడా పెద్దగా లేవు. దీని వల్ల సంక్రాంతి సందడి మళ్ళీ బాక్సాఫీస్ వద్ద కనిపించలేదు. వేసవి సెలవులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సీజన్ చాలా ముఖ్యం.
పెద్దగా పోటీ లేకుండా బరిలో దిగడం టిల్లు స్క్వేర్ కున్న అతి పెద్ద సానుకూలాంశం. నిన్న వచ్చిన ది గోట్ లైఫ్ ఆడు జీవితంకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కినా కామన్ ఆడియన్స్ ని మెప్పించడం కష్టంగానే ఉంది. పైగా సలార్ విలన్ గా ఎంత గుర్తింపు ఉన్నా పృథ్విరాజ్ సుకుమారన్ ను సోలోగా ఇంత సుదీర్ఘమైన సర్వైవల్ డ్రామాని తెరమీద చూడటం అంత సులభం కాదు. అయితే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ ఒక్కటే చెప్పుకోదగ్గ క్రేజ్ తో యువత, పిల్లలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇవి కాకుండా మరో మూడు నాలుగు రిలీజులున్నాయి కానీ బజ్ లేదు.
సో ఓపెన్ గ్రౌండ్ లో టిల్లు స్క్వేర్ ఎన్ని సిక్సర్లు కొడతాడో చూడాలి. రెండు గంటల క్రిస్పీ లెన్త్ చాలా పెద్ద ప్లస్ కానుంది. డీజే టిల్లు కొనసాగింపుగా దాన్ని బ్రాండ్ ని ఖచ్చితంగా నిలబెడతామని టీమ్ హామీ ఇస్తోంది. సిద్దు జొన్నలగడ్డ రెండేళ్ల కష్టానికి తగ్గ ఫలితం కూడా ఈ రోజు వచ్చేస్తుంది. నేహా శెట్టి లేకపోయినా అనుపమ పరమేశ్వరన్ తో చేయించిన గ్లామర్ షో టిల్లు స్క్వేర్ కి ఆకర్షణగా నిలుస్తోంది. దర్శకుడు మారడం, నేపధ్య సంగీతాన్ని తమన్ ఇవ్వలేకపోవడం లాంటి ఇబ్బందులు తలెత్తినప్పటికీ క్వాలిటీ విషయంలో టిల్లు స్క్వేర్ రాజీ పడలేదు. చూడాలి రెండో టిల్లు ఎలాంటి కిక్ ఇస్తాడో
This post was last modified on March 29, 2024 8:50 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…