ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మ్యాన్ గా రాబోతున్నాడు. టైటిల్ తో మొదలుపెట్టి పాటల దాకా దీని మీద ముందు నుంచి కుటుంబ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. గీత గోవిందం రూపంలో కెరీర్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్ తో రౌడీ హీరో చేతులు కలపడంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ 5 విడుదల కాబోతున్న ఈ లవ్ కం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు గోపి సుందర్ అందించిన సంగీతం మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్ళు ట్రైలర్ మీద ఉన్నాయి. హైప్ పెంచే బాధ్యత కూడా దీని మీదే ఉంది మరి.
మధ్యతరగతికి చెందిన గోవర్ధన్(విజయ్ దేవరకొండ) చక్కగా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ ఇల్లు, అక్క, బామ్మ, అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇలా హ్యాపీగా గడిపేస్తూ ఉంటాడు. పై పోర్షన్ లో కొత్తగా చేరిన అమ్మాయి(మృణాల్ ఠాకూర్) మీద తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు. పరిచయం ప్రేమగా మారి ఒక్కటయ్యే సమయంలో ఆమె మనుషుల(జగపతి బాబు – అచ్యుత్ కుమార్) వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటాడు. ఒకవైపు ప్రేమ పెళ్లి, ఇంకోవైపు శత్రువులతో రాజీలేని యుద్ధం. చివరికి ఈ పద్మవ్యూహం నుంచి గోవర్ధన్ ఎలా బయటపడ్డాడనేది స్టోరీ.
కథను పెద్దగా దాచకుండా మెయిన్ పాయింట్ ని రివీల్ చేయడంలోనే టీమ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది.విజయ్ దేవరకొండ టైమింగ్ డిఫరెంట్ గా ఉండగా మృణాల్ ఠాకూర్ తో కెమిస్ట్రీ ఫ్రెష్ గా అనిపిస్తోంది. రోహిణి హట్టంగడి, వాసుకి, హరీష్ ఉత్తమన్ తో పాటు చిన్న పిల్లల గ్యాంగ్ పెద్దదే కనిపిస్తోంది. బీజీఎమ్ కూల్ గా సాగింది. 2 గంటల 30 సెకండ్లలో మ్యాటరేంటో చెప్పేశారు కాబట్టి ఇంకో వారం రోజుల్లో రిలీజ్ కోసం ఎదురు చూసేలా ప్రేక్షకులను సిద్ధం చేశారు. ఖుషిలో మిస్ అయిన ఎంటర్ టైన్మెంట్ ఫ్యామిలీ స్టార్ లో బాగా కుదిరినట్టుంది. జనాలకు కనెక్ట్ అయితే సూపర్ హిట్టు పడ్డట్టే.
This post was last modified on March 28, 2024 5:19 pm
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…