వారసత్వ హీరోలతో నిండిపోయిన టాలీవుడ్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం టాలెంట్‌తో నిలదొక్కుకుని స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరోలు తక్కువమంది. ఆ జాబితాలో విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యువ కథానాయకులుంటారు. వీళ్లు సంపాదించుకున్న ఫాలోయింగ్ అంతా వాళ్ల కష్టానికి ఫలితమే. ఐతే కొంత స్టార్ ఇమేజ్ సంపాదించాక.. దాన్ని ఇంకా పెంచుకుని నెక్స్ట్ లెవెల్ లీగ్‌లోకి అడుగు పెట్టాలని ఏ హీరోకైనా ఉంటుంది. విజయ్, సిద్ధు కూడా అందుకు మినహాయింపు కాదు.
ఐతే కెరీర్లో చాలా వేగంగా స్టార్ ఇమేజ్ సంపాదించి వంద కోట్ల హీరో కూడా అయిన విజయ్.. ఆ తర్వాత తిరోగమన బాటలో పయనించాడు. వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ లాంటి డిజాస్టర్లు అతన్ని వెనక్కి లాగాయి. ఇక ‘లైగర్’ అయితే అతణ్ని మామూలు దెబ్బ కొట్టలేదు. గత ఏడాది వచ్చిన ‘ఖుషి’ కూడా ఓ మోస్తరుగా ఆడిందంతే.
మళ్లీ ‘గీత గోవిందం’ లాంటి సక్సెస్ కోసం చూస్తున్న అతను ‘ఫ్యామిలీ స్టార్’ మీద ఆశలు పెట్టుకున్నాడు. ఇక సిద్ధు విషయానికి వస్తే ‘చాలా ఏళ్ల పోరాటం తర్వాత అతను ‘డీజే టిల్లు’తో పెద్ద బ్రేక్ అందుకున్నాడతను. ఆ తర్వాత చాలా ఛాన్సులు వచ్చినా ఒప్పుకోకుండా తన కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే సినిమాగా నమ్మి ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ చేశాడు.
విజయ్, సిద్ధుల కొత్త సినిమాలకు సూపర్ టైమింగ్ కుదిరింది. మామూలుగా సమ్మర్ సీజన్ అంటే పెద్ద హీరోల సినిమాలు బరిలో ఉంటాయి. ఈసారి వేసవిలో ఏ భారీ చిత్రం రావట్లేదు. అత్యంత క్రేజ్ ఉన్నది టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ మూవీస్‌కే. ప్రేక్షకులు వేసవి వినోదానికి సిద్ధమవుతూ మంచి సినిమాల కోసం ఎదురు చూస్తున్న టైంలోనే ఇవి రిలీజవుతున్నాయి. ఈ సినిమాలు ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి. ప్రేక్షకులూ మంచి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. పైగా సమ్మర్ సీజన్. విజయ్, సిద్ధు తమ కెరీర్లను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. కావాల్సిందల్లా ఈ సినిమాలకు మంచి టాక్ రావడమే.
This post was last modified on March 27, 2024 11:42 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…