Movie News

జరగండి జరగండి.. ఎలా ఉందండి

మూడేళ్ళుగా మెగాభిమానులు ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ మొదటి అఫీషియల్ వీడియో అప్డేట్ వచ్చేసింది. జరగండి జరగండి లిరికల్ సాంగ్ ని రామ్ చరణ్  పుట్టినరోజు సందర్భంగా ఇవాళ విడుదల చేశారు. ఇది గతంలో లీకైన పాటే అయినప్పటికీ తాజా వెర్షన్ లో గాయకుడిని మార్చడంతో పాటు ఫీడ్ బ్యాక్ ని దృష్టిలో ఉంచుకుని సాహిత్యంలో స్వల్ప మార్పులు చేసినట్టు అనిపించింది. మగధీర తర్వాత బాలీవుడ్ సింగర్ దలేర్ మెహేందీ మెగా పవర్ స్టార్ కు గాత్రం ఇవ్వడం విశేషం. తమన్ సంగీతం మీద ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. అందులోనూ ప్యాన్ ఇండియా మూవీ.

పాట విషయానికి వస్తే విజువల్స్ కలర్ఫుల్ గా ఉన్నాయి. చరణ్ ఎప్పటిలాగే అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో ఆకట్టుకున్నాడు. కియారా అద్వానీ గ్లామర్ గురించి తెలిసిందే. ఇది ఫుల్ వీడియో సాంగ్ కాకపోయినా కాసిన్ని డాన్స్ మూమెంట్స్ చూపిస్తారని ఫ్యాన్స్ ఆశపడ్డారు. ఒకటి రెండు తప్ప ఎక్కువ రివీల్ కాకుండా కట్ చేశారు. ప్రభుదేవా కొరియోగ్రఫీలోని మేజిక్ ని తెలియనివ్వలేదు. జాబిలమ్మ జాకెటేసుకొచ్చెనండీ పదాలని యధాతథంగా ఉంచేశారు కానీ ప్యారడైజ్, ఎలాన్ మాస్క్, షేర్ లాంటి ట్రెండీ కంటెంట్ ని గీత రచయిత అనంత శ్రీరామ్ పొందుపరిచారు. ట్యూన్ క్యాచీగానే ఉంది.

తమన్ బీట్స్ గతంలో వచ్చిన వారసుడు రంగతమే తరహాలో ఉన్నప్పటికీ మాస్ వర్గాలను దృష్టిలో ఉంచుకున్హి కంపోజ్ చేసింది కావడంతో థియేటర్ లో  అభిప్రాయాలు మారిపోయే అవకాశం లేకపోలేదు. దర్శకుడు శంకర్, చరణ్, ప్రభుదేవాలు కలిసి పని చేసిన క్లిప్స్ ఇందులో పొందుపరిచారు. అభిమానుల నుంచి కొంత మిశ్రమ స్పందన వచ్చినా ఇలాంటివికి సాధారణంగా స్లో పాయిజన్ లాగా నెమ్మదిగా ఎక్కుతాయి. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎస్విసి టీమ్ ఇచ్చిన కానుక స్వీట్ గా ఉంది. పనిలో పని విడుదల తేదీ కూడా పొందుపరిచి ఉంటే ఇంకా ఆనందం కలిగించేది.

This post was last modified on March 27, 2024 10:16 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

38 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago