హీరో హీరోయిన్లు తెర మీద రొమాన్స్ పండిస్తుంటే యువ ప్రేక్షకులు వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ సన్నివేశాల్లో నటించడం ఏమంత కష్టం కాదనిపిస్తుంది. తక్కువ కష్టంతో ఎక్కువ పేరొస్తుందని హీరోయిన్లు ఆ తరహా సీన్లలో నటిస్తారని భావిస్తారు. కానీ మిగతా అన్ని సీన్ల కంటే రొమాంటిక్ సీన్లు చేయడమే చాలా కష్టం అన్నది గ్లామర్ హీరోయిన్లుగా పేరుబడ్డ చాలామంది చెప్పేమాట.
తన తొలి సినిమా ‘చిత్రం’లో ఒక రేంజిలో ఇంటిమేట్ సీన్లు చేయడమే కాక.. ఆ తర్వాత కూడా ఎక్కువగా గ్లామర్ క్యారెక్టర్లే చేసిన రీమాసేన్ సైతం తర్వాత తాను రొమాంటిక్ సీన్లు చేస్తుంటే నరకంగా అనిపించేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. ఇక కెరీర్లో చాలా వరకు ట్రెడిషనల్ రోల్సే చేసి.. ఇప్పుడు కొత్తగా గ్లామర్ రూట్‌లోకి అడుగు పెట్టిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. రొమాంటిక్ సీన్లు చేయడంలో ఉన్న కష్టం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
‘టిల్లు స్వ్వేర్’ మూవీ కోసం అనుపమ కెరీర్లో ఇంతవరకు ఎప్పుడూ కనిపించనంత గ్లామరస్‌గా కనిపించడం.. ఇంటిమేట్ సీన్లు చేుయడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఐతే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన అనుభవం గురించి అనుపమ మాట్లాడుతూ.. ‘‘తెరపై చూసేవాళ్లకు అది మామూలుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్లు ఎంజాయ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.
కానీ వంద మంది క్రూ ముందు రొమాన్స్ చేయడం.. అది సహజంగా ఉండేలా చూసుకోవడం అంత కష్టం కాదు. మిగతా అన్ని సీన్ల కంటే అవే చాలా కష్టం అని నా అభిప్రాయం ఇలాంటి సీన్లతో మెప్పించడం తేలిక కాదు. ‘టిల్లు స్క్వేర్’లో ఇంటిమేట్ సీన్లు చేస్తున్నపుడు చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఒక నటిగా అన్ని రకాల పాత్రలూ చేయాలి కాబట్టి ఇది చేశాను’’ అని అనుపమ చెప్పింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ రూపొందించిన ‘టిల్లు స్క్వేర్’ ఈ నెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 26, 2024 11:59 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…