నిన్న ప్రకటించిన రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ కాంబో ప్యాన్ ఇండియా మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ఉంటుందో ఇంకా యూనిట్ కే తెలియదు. బుచ్చిబాబుతో చేస్తున్న ఆర్సి 16 మీద దీని ప్లానింగ్ ఆధారపడి ఉంది. అయితే జానర్ కు సంబంధించి యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది తప్ప రంగస్థలం తరహాలో పల్లెటూరి నేపథ్యంలో ఉండదని నిన్న మా సైట్ ఎక్స్ క్లూజివ్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప 1 జరుగుతున్న టైంలోనే దీని కథను సిద్ధం చేసుకున్న సుకుమార్ ఇంట్రో ఎపిసోడ్ ఎలా ఉంటుందో ఓ సందర్భంగా రాజమౌళికి పూసగుచ్చినట్టు వివరించాడు. ఈ సంఘటన జక్కన్న గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆర్ఆర్ఆర్ జరుగుతున్న టైంలో ఎస్ఎస్ కార్తికేయ కూడా దీన్ని విన్నాడు. ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఎప్పడూ చూడనంత గొప్పగా ఓపెనింగ్ సీన్ ఉంటుందని, చూస్తూ చూస్తూ కుర్చీల అంచులకు వచ్చేయడం ఖాయమని తండ్రి కొడుకులు ఇద్దరూ ఊరించడం చూసి మెగా ఫ్యాన్స్ సంతోషం మాములుగా లేదు. వినడానికే ఇంత ఎలివేషన్ అనిపిస్తే ఇక స్క్రీన్ మీద జరిగే అరాచకం మాటలకు అందదేమోని అంచనాలు పెంచేసుకుంటున్నారు. సుక్కు టేకింగ్ కి జక్కన్న ముందు నుంచి అభిమానే. జగడం లాంటి ఫ్లాప్ మూవీలో తనకు నచ్చిన విషయాల గురించి చెబుతారు రాజమౌళి.
ఈ లెక్కన చరణ్ సుకుమార్ కలయిక మాములుగా ఉండేలా లేదు. గేమ్ ఛేంజర్ విడుదలకు ఎంత టైం ఉన్నా వేసవి నుంచి బుచ్చిబాబు షూటింగ్ మొదలైపోతుంది. జాన్వీ కపూర్ డేట్లు కూడా దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకున్నారట. విలన్ గా సంజయ్ దత్ తో పాటు కన్నడ తమిళం నుంచి క్రేజీ క్యాస్టింగ్ తెచ్చుకునే పనులు ఊపందుకున్నట్టు తెలిసింది. చరణ్ మేకోవర్ కు కనీసం రెండు నెలలు టైం పట్టొచ్చని తెలిసింది. పుష్ప 2 ది రూల్ కనక బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు ఆర్సి 17కొచ్చే క్రేజ్ ప్యాన్ ఇండియాకు మించే ఉంటుంది. సమ్మర్ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుని సుకుమార్ దీని పని మీద ఉంటారు.
This post was last modified on March 26, 2024 4:59 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…