సోషల్ మీడియాతో మీకు పరిచయం వుండుంటే ఈపాటికే పూరీ మ్యూజింగ్స్ మీ చెవిన పడి వుండాలి. అవును… ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన ఆలోచనలను ‘పూరీ మ్యూజింగ్స్’ పేరిట వినిపిస్తున్నాడు. ఆ టాపిక్ లేదు, ఈ టాపిక్ లేదు…. అమ్మాయిల నుంచి, సెక్స్ నుంచి, బుద్ధుడి నుంచి దోమల వరకు అన్ని టాపిక్స్ గురించి పూరి తన భావాలు వ్యక్తపరుస్తున్నాడు.
షూటింగ్స్ వున్న టైమ్‍లో కూడా ఖాళీ వున్నపుడల్లా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసే పూరి తనకు తెలియని ప్రతి దాని గురించీ చదివేస్తుంటాడు. కేవలం సినిమాలకు పనికొచ్చే అంశాలే కాకుండా ప్రపంచంలోని అన్ని వింతలు, విశేషాల గురించీ పూరి తెలుసుకుంటూ వుంటాడు. ఆ జ్ఞానమంతా ఇప్పుడు ఇలా మ్యూజింగ్స్ ద్వారా అందరికీ పంచేస్తున్నాడు. అయితే ఈ మాటలన్నీ తనదైన శైలిలో మాస్ పదజాలం జోడించి చెబుతూ వుండడంతో చాలా మంది ఇన్‍స్టంట్‍గా కనక్ట్ అయిపోతున్నారు. కొందరయితే ఈ మ్యూజింగ్స్ కి అడిక్ట్ అయిపోయారు.
ఎప్పుడో వారానికో ఒక టాపిక్ గురించి మాట్లాడ్డం కాకుండా అదే పనిగా ఒక యజ్ఞంలా ఈ మ్యూజింగ్స్ తో పూరి తన ఫాలోవర్స్ కి జ్ఞానం పంచుతున్నాడు. కొన్ని టాపిక్స్ పై పూరి అభిప్రాయాలకి నిరసన వ్యక్తమయినా కానీ పూరి అవేమీ పట్టించుకోకుండా తదుపరి టాపిక్‍కి వెళ్లిపోతున్నాడు. అన్నీ మూడు, నాలుగు నిమిషాల ఆడియో క్లిప్పులే కనుక సరదాగా ఓ చెవి వేయండి. పూరి స్టైల్లో చెప్పాలంటే… ఫ్రీగా నాలెడ్జ్ దొరికితే వినడానికి నొప్పేంటి చెప్పండి.
This post was last modified on September 13, 2020 9:31 pm
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…
టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్…
జగన్ హయాంలో అనేక తప్పులు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. మరీ ముఖ్యంగా కొన్ని తప్పుల కారణంగా.. రాష్ట్రం…