హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా ఎంతో పేరు సంపాదించుకున్న శ్రీకాంత్ నట వారసత్వం అందిపుచ్చుకున్న రోషన్ మేక సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై మూడేళ్లు దాటేసింది. 2021లో రిలీజైన పెళ్లి సందD బ్లాక్ బస్టర్ కాకపోయినా తనకు, శ్రీలీలకు బోలెడు పేరు, ఆఫర్లు తీసుకొచ్చింది. ఒకపక్క ఆ అమ్మాయేమో దూసుకుపోతుండగా మనోడు మాత్రం బాగా స్లో అయిపోయాడు. వైజయంతి బ్యానర్ లో ఛాంపియన్ ని నెలల క్రితమే ప్రకటించారు. ప్రదీప్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు. ప్రభాస్ కల్కి వల్లనో లేక మరో కారణమో ప్రొడక్షన్ హౌస్ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు.
మోహన్ లాల్ మలయాళంలో తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ వృషభలో కీలక పాత్ర దక్కించుకున్నాడు కానీ దాని విడుదలకు చాలా టైం పట్టేలా ఉంది. అసలు రోషన్ ఎక్కడ లెక్క తప్పుతున్నాడనేది అంతు చిక్కడం లేదు. అందం, టాలెంట్ రెండు ఉన్నప్పటికీ సరైన ప్లానింగ్ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందో అఖిల్ విషయంలో చూస్తున్నాం. అలాంటిది అంత పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికీ పెద్ద బ్యానర్లు ముందుకొస్తున్నప్పుడు కొంచెం వేగంగా సినిమాలు చేయాలి. లేకపోతే ఆడియన్స్ కొత్త రిలీజ్ వచ్చినప్పుడు ఎవరీ కుర్రాడని అనుకునే రిస్క్ లేకపోలేదు.
ఇవి కాకుండా రోషన్ అఫీషియల్ గా ఒప్పుకున్న కమిట్ మెంట్లు ఏమి లేవు. ఒకపక్క శ్రీకాంత్ ఏమో బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు. ఇటు కొడుకు కెరీర్ ఏమో నెమ్మదిగా సాగుతోంది. మైత్రి సంస్థ కూడా ఒక సినిమా ప్లాన్ చేసుకుందనే టాక్ వినిపించింది కానీ తర్వాత ఎలాంటి సౌండ్ లేదు. ఛాంపియన్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి థియేటర్లకు తీసుకొస్తే బెటర్. కాంపిటీషన్ వల్ల స్లోగా ఉంటే సరిపోదు. తెలివిగా పరుగులు పెట్టాలి. అన్నివేళలా నిదానమే ప్రధానం సూత్రం సెట్టవ్వదు. స్వంతంగా ఇమేజ్, మార్కెట్ ఏర్పడని రోషన్ కు ఒక సరైన బ్లాక్ బస్టర్ పడితే మొత్తం సెట్ అవుతుంది. అదెప్పుడనేదే ప్రశ్న.
This post was last modified on March 24, 2024 1:05 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…