‘లియో’ సినిమా తేడా కొట్టి ఉండొచ్చు కానీ.. దర్శకుడు లోకేష్ కనకరాజ్‌కు ఉన్న ఫాలోయింగే వేరు. ఖైదీ, విక్రమ్ సినిమాలతో అతను భారీగా అభిమానగణాన్ని సంపాదించుకున్నాడు. తాను ఇప్పటిదాకా తీసిన సినిమాలన్నింటికీ ఏదో ఒక కనెక్షన్ పెట్టి ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్’ పేరుతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడతను.
‘లియో’ నిరాశ పరిచాక సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకు స్క్రిప్టు తయారు చేసుకునే ఉన్న అతను.. ఉన్నట్లుండి నటుడిగా తెరపైకి రావడం అందరికీ పెద్ద షాక్. తన అభిమాన కథానాయకుడు కమల్ హాసన్ తనయురాలు శ్రుతి హాసన్‌తో అతను రొమాన్స్ చేయడం సోషల్ మీడియాకు పెద్ద షాక్. వీళ్లిద్దరూ కలిసి ‘ఇనిమేల్’ అనే మ్యూజిక్ వీడియో చేశారు. దీని కాన్సెప్ట్ అంతా శ్రుతి హాసన్‌దే. ఒక ప్రేమ జంట జర్నీని ఇందులో చూపించనున్నారు.
‘ఇనిమేల్’ ప్రోమోలో శ్రుతి హాసన్ పక్కన లోకేష్ కనకరాజ్‌ను చూసి జీర్ణించుకోవడం కష్టమైంది కొందరికి. అతను కూడా కొంత అన్ ఈజీగానే కనిపించాడు. లోకేష్‌కు నటన మీద అంత మోజేంటి.. శ్రుతితో అతను రొమాన్స్ చేయడమేంటి అని కొందరు తనపై నెగెటివ్ కామెంట్లు కూడా చేశారు. ఐతే ఈ మ్యూజిక్ వీడియోలో నటించే ఉద్దేశమే లోకేష్‌కు లేదట. ముందు ఈ ప్రపోజల్ పెడితే తాను చేయనని ఖరాఖండిగా చెప్పేశాడట.
కానీ శ్రుతి ఈ వీడియో కాన్సెప్ట్ వివరించి, బలవంత పెడితే కానీ అతను ఒప్పుకోలేదట. కాబట్టి అనవసరంగా లోకేష్‌ను టార్గెట్ చేసే జనాలు ఇక సైలెంట్ అయితే బెటర్. ఈ వీడియోకు మ్యూజిక్ కంపోజింగ్ చేసింది కూడా శ్రుతినే కాగా.. ‘కేజీఎఫ్’, ‘సలార్’ ఫేమ్ భువన్ గౌడ ఛాయాగ్రహణం అందించాడు. సోమవారమే ఈ మ్యూజిక్ వీడియో లాంచ్ కాబోతోంది.
This post was last modified on March 24, 2024 10:32 am
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…