వచ్చే వారం విడుదల కాబోతున్న టిల్లు స్క్వేర్ మీద ఇప్పటికే ఉన్న అంచనాలు క్రమంగా ఎగబాకుతున్నాయి. యూత్ లో దీని మీదున్న క్రేజ్ దృష్ట్యా భారీ రిలీజ్ దక్కబోతోంది. నిన్న రిలీజైన ఓం భీమ్ బుష్ కు కామెడీ లవర్స్, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా ఆశించిన స్థాయిలో వసూళ్ల రూపంలో కనిపించడం లేదు. ఒకవేళ వీకెండ్ రెండు రోజుల ఏదైనా అనూహ్యమైన పికప్ ఉంటే హిట్ క్యాటగిరీలోకి చేరిపోతుంది. టిల్లు మీద ఉన్న హైప్ ని దృష్టి పెట్టుకుంటే శ్రీవిష్ణు టీమ్ వీలైనంత వసూళ్లు మొదటి వారంలోనే తెచ్చుకుంటే ఈజీగా సేఫ్ అయిపోవచ్చు.
ట్రేడ్ టాక్ ప్రకారం టిల్లు స్క్వేర్ థియేట్రికల్ బిజినెస్ ముప్పై నుంచి ముప్పై అయిదు కోట్ల మధ్యలో జరిగిందట. సిద్దు జొన్నలగడ్డ మార్కెట్ కి ఇది భారీ మొత్తమే కానీ టిల్లు బ్రాండ్ కున్న వేల్యూ వల్ల డిస్ట్రిబ్యూటర్లు రిస్క్ కి రెడీ అవుతున్నారట. పైగా ఫిబ్రవరి నుంచి జనాలను తండోపతండాలుగా థియేటర్లకు తీసుకొచ్చిన సినిమా ఒక్కటి రాలేదు. డీసెంట్ హిట్లున్నాయి తప్ప బ్లాక్ బస్టర్లు పడలేదు. చివరిది హనుమాన్ మాత్రమే. మళ్ళీ అంత కెపాసిటీ టిల్లు స్క్వేర్ చూపిస్తుందని టాక్. మెయిన్ స్క్రీన్లకు నాలుగు వారాల అగ్రిమెంట్ చేసుకోమని నిర్మాత చెప్పడమే దీనికి నిదర్శనమట.
పాజిటివ్ టాక్ వస్తే మాత్రం టిల్లు స్క్వేర్ కి తిరుగు ఉండదు. వారం గ్యాప్ లోనే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వస్తున్నప్పటికీ పూర్తిగా ప్రభావం చెందే అవకాశం ఉండకపోవచ్చు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ రామ్ కామ్ క్రైమ్ థ్రిల్లర్ లో చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయని ఇన్ సైడ్ రిపోర్ట్. యు/ఏ సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్న టిల్లు స్క్వేర్ నిడివి కూడా రెండుంపావు గంటలలోపే ఉందట. లెన్త్ ఎంతనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. హాలీవుడ్ మూవీ గాడ్జిలా వర్సెస్ కాంగ్ న్యూ ఎంపైర్, పృథ్విరాజ్ ఆడు జీవితం మాత్రమే పోటీలో ఉన్నాయి. చూడాలి టిల్లు ఏం చేయబోతున్నాడో
This post was last modified on %s = human-readable time difference 11:52 am
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!.…
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…