Movie News

ఆడు జీవితంకు రెండు సవాళ్లు

సలార్ లో ప్రభాస్ ఫ్రెండ్ వరదరాజ మన్నార్ గా మెప్పించిన పృథ్విరాజ్ సుకుమారన్ దాని వల్ల తెలుగు ప్రేక్షకులకు దగ్గరివాడయ్యాడు. అందుకే ఆయన నటించిన ది గోట్ లైఫ్ ఆడు జీవితంని ఈ నెల మార్చి 28న భారీ ఎత్తున ఏపీ, తెలంగాణలోనూ విడుదల చేయబోతున్నారు. పంపిణి బాధ్యతలు మైత్రి తీసుకోవడంతో బయ్యర్ల చేయూత బలంగా ఉండబోతోంది. పోటీగా ఉన్న టిల్లు స్క్వేర్ ని కాచుకోవడం అంత సులభం కాదు. యూత్ లో దానికున్న క్రేజ్ చాలానే ఉంది. పైగా వెరైటీ ప్రమోషన్ల ఆల్రెడీ ఉన్న బజ్ ని అమాంతం పెంచే పనిలో ఉంది టీమ్.

ఆడు జీవితం సర్వైవల్ థ్రిల్లర్. చాలా తక్కువ పాత్రలు ఉంటాయి. స్క్రీన్ మొత్తం పృథ్విరాజే అధిక శాతం కనిపిస్తాడు. ఎడారిలో నెలల తరబడి చిక్కిన మనిషి ఎలా బ్రతికి బట్టకట్టాడనే పాయింట్ మీద రూపొందించారు. టిల్లు స్క్వేర్ ఒకపక్క కాంపిటీషన్ అనుకుంటే ఇంకోవైపు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మీద పిల్లలు వెయిట్ చేస్తున్నారు. సో సలార్ విలన్ కు సవాల్ ఎదురు కావడం ఖాయం. కానీ పృథ్విరాజ్ నమ్మకం మాములుగా లేదు. అదే పనిగా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో పలు విశేషాలు పంచుకున్నాడు.

సలార్ లో రాజులా కనిపిస్తే ఇందులో బానిస పాత్ర చేశానని, రోజుల తరబడి ఆహరంలో కఠిన ఆంక్షలు పాటించి బరువు పెరగడం, తగ్గడం చేశానని చెప్పుకొచ్చాడు. మలయాళం డబ్బింగులు బాగుంటే ఆదరణ దక్కుతుందని ఇటీవలే ప్రేమలు నిరూపించింది. అదే తరహాలో ఆడు జీవితం కూడా హిట్ అవుతుందనే నమ్మకం మేకర్స్ లో కనిపిస్తోంది. మలయాళం తెలుగులో సమాంతరంగా థియేటర్లలో రిలీజవుతున్న పృథ్విరాజ్ మొదటి సినిమా ఇదేనని చెప్పొచ్చు. ఒకప్పుడు రామ్ చరణ్ సరసన నాయక్ లాంటి సినిమాలు చేసిన అమలా పాల్ ఆడు జీవితంలో మెయిన్ లీడ్ చేయడం విశేషం.

This post was last modified on March 23, 2024 8:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

2 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

3 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

4 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

4 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

6 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

7 hours ago