కొందరు హీరోయిన్లు చూడ్డానికి యావరేజ్ అనిపించినా.. వాళ్లకు కెరీర్ ఆరంభంలో బాగా కలిసొచ్చి అవకాశాలు వెల్లువెత్తుతాయి. అదే సమయంలో టాప్ హీరోయిన్ కాగల లక్షణాలు ఉన్నప్పటికీ.. కాలం కలిసిరాక కొంతమంది ఒక స్థాయికి మించి ఎదగలేకపోతుంటారు.
రుహాని శర్మ రెండో కోవకు చెందిన అమ్మాయే. ఈ ముంబయి భామ తెలుగులో చేసిన తొలి సినిమా హిట్టే. కానీ అదొక చిన్న సినిమా కావడం, పైగా ఆమె చేసింది పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ కావడమే శాపమైంది. సుశాంత్ సరసన రుహాని చేసిన ఆ చిత్రమే.. చిలసౌ. ఇందులో మంచి పాత్ర చేసి మెప్పించినా.. గ్లామర్ కోణంలో ఆకట్టుకోలేకపోయింది రుహాని. దీంతో తనపై ఒక ముద్ర పడిపోయింది.
ఆ తర్వాత ఎక్కువగా చిన్న సినిమాల్లోనే ఛాన్సులు వచ్చాయి. పెద్ద సినిమాల్లో నటించిన అవన్నీ నామమాత్రమైన సహాయ పాత్రలే. ఆ సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. తనకు గుర్తింపు తేలేదు. ఈ మధ్యే సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్ లాంటి సినిమాల్లో నటించినా ప్రయోజనం లేకపోయింది. కానీ రుహాని సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు చూస్తే మాత్రం అగ్ర హీరోయిన్లకు ఏం తక్కువ అనిపిస్తుంది. అందులోనూ ఈ మధ్య పనిగట్టుకుని సూపర్ హాట్ ఫొటోలు షేర్ చేస్తోంది రుహాని.
ఆమె వెకేషన్ ఫొటోస్ అయితే.. ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ప్రత్యేకంగా ఫొటో షూట్లు చేయకుండా జస్ట్ సెల్ఫీ ఫొటోలు పెట్టి మంటలు పుట్టించేస్తోంది రుహాని. తాజాగా ఆమె బీచ్‌లో సేదదీరుతున్న ఫొటోలైతే మామూలు హాట్‌గా లేవు. ఇలాంటి ఫొటోలు చూసినపుడల్లా.. ఇంతందం పెట్టుకుని సినిమాల్లో అలాంటి పాత్రలు చేస్తోందేంటి తన సోషల్ మీడియా ఫాలోవర్లు, ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
This post was last modified on March 22, 2024 7:04 pm
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…
వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ తీవ్రంగా కుదుపునకు గురైందని సీఎం చంద్రబాబు చెప్పారు. జగన్ దెబ్బకు ఏపీ బ్రాండ్ కదిలిపోయింది.…
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ వలసదారుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.…
మొన్న శుక్రవారం రావాల్సిన అఖండ 2 వాయిదా పడటంతో థియేటర్లు బోసిపోతున్నాయి. ఉన్నంతలో ఆంధ్రకింగ్ తాలూకా, రాజు వెడ్స్ రాంబాయి,…
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సోమవారం.. జాతీయ గేయం వందేమాతరంపై చర్చ జరిగింది. ఈ గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యాన్ని…
ఎలన్ మస్క్ కంపెనీ 'స్టార్లింక్' ఎప్పుడెప్పుడు ఇండియాకు వస్తుందా అని టెక్ లవర్స్ అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ…