ఇంకా మొదలుపెట్టకుండానే ప్రేక్షకుల్లో, మీడియాలో హాట్ టాపిక్ గా మారిన బాలీవుడ్ రామాయణం ఇప్పట్లో తెమిలేలా లేదు. వచ్చే నెల శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభోత్సవం ఉంటుందనే ప్రచారానికి బ్రేక్ వేస్తూ అసలు ఈ ఏడాది షూటింగ్ జరగడం అనుమానమేనని లేటెస్ట్ అప్డేట్. దానికి చాలా కారణాలున్నాయట. మొదటిది క్యాస్టింగ్ వ్యవహారం. రాముడిగా రన్బీర్ కపూర్ తప్ప మిగిలిన పేర్లన్నీ గాసిప్స్ రూపంలో వచ్చినవే. సీతగా సాయిపల్లవి ఒప్పుకుందని అంటున్నారు కానీ మీడియా ఎక్కడైనా కలిసినప్పుడు ఆమె దీని ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతోంది.
మూడు భాగాలు ప్లాన్ చేసుకోవడంతో ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పడుతోంది. పైగా ఆర్టిస్టుల కాల్ షీట్స్ ఎంత అవసరం అవుతాయనే దాని మీద దర్శకుడు నితీష్ తివారి బృందం కసరత్తు చేస్తూనే ఉంది. ఒకవేళ లాంఛనంగా వచ్చే నెల అయోధ్యలో ఓపెనింగ్ చేయాలన్నా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏ పార్టీ వారిని ఆహ్వానించలేరు. ప్రధాని మోడీ సమక్షంలో ఈ కార్యక్రమం చేయాలని నిర్మాతల ఆలోచన. ఇప్పుడది సాధ్యం కాదు. అసలు ట్విస్టు ఏంటంటే రావణాసురుడిగా యష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనేది బెంగళూరు టాక్. తను టాక్సిక్ తో చాలా బిజీగా ఉన్నాడు.
ఇవన్నీ చూస్తుంటే ఈ రామాయణంని కొంత కాలం మర్చిపోవడం బెటర్. ఇప్పటికే విజయ్ సేతుపతి తప్పుకున్నాడు. సన్నీ డియోల్ ప్రాధమికంగా ఓకే చెప్పాడు కానీ ఇంకా అగ్రిమెంట్ అవ్వలేదు. రకుల్ ప్రీత్ సింగ్ తో సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. నవీన్ పోలిశెట్టి సైతం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట. పురిట్లోనే ఇన్ని బ్రేకులు పడుతున్న రామాయణంని నభూతో నభవిష్యత్ రేంజ్ లో తెరకెక్కించాలని నితీష్ తివారి ఆలోచన. యానిమల్ తర్వాత రన్బీర్ కపూర్ కమిట్ మెంట్స్ వేరే ఉన్నాయి. బ్రహ్మస్త్ర 2తో పాటు యానిమల్ పార్క్ కు సంబంధించిన డిస్కషన్లు జరుగుతున్నాయి.
This post was last modified on March 22, 2024 10:33 am
కొన్ని రాజకీయ చర్చలు ఆసక్తిగా ఉంటాయి. ఆయా పార్టీల నాయకులు కూడా.. సుదీర్ఘకాలం చర్చించుకునేలా ఉంటాయి. అలాంటి రాజకీయ చర్చల్లో…
ఏపీ సీఎం చంద్రబాబు జపిస్తున్న పీ-4 మంత్రం గురించి తెలుసుకదా! పేదలను ధనికులుగా చేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.…
పూజా హెగ్డే.. ఒక దశలో టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా ఉన్న భామ. తమిళంలో కూడా ఆమెకు మంచి క్రేజే…
అభిమానులు వీలు దొరికినప్పుడంతా ఓజి ఓజి అంటూ జపం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ నిజానికది ఈ…
కూటమిలో ప్రధాన రోల్ పోషిస్తున్న టీడీపీ.. ఇటు పాలనపరంగా.. అటు అభివృద్ధి, సంక్షేమాల పరంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికి…
వైసీపీ అధినేత జగన్కు షాకిచ్చే పరిణామం. రాష్ట్రంలోని బీజేపీ-టీడీపీ-జనసేనల కూటమిని ఆయన ఎంత తేలికగా తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఈ…