Movie News

ఈ వేసవికి బిగ్గెస్ట్ మూవీ ఇదేనా?

వేసవి సీజన్ వస్తోందంటే పెద్ద పెద్ద సినిమాలు వస్తాయని ఆశలు పెట్టుకుంటారు సినీ అభిమానులు. కానీ కొన్నేళ్లుగా టాలీవుడ్ సమ్మర్ సీజన్‌లో ఆశించిన స్థాయిలో కళ ఉండట్లేదు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 చిత్రాలు సందడి చేసిన 2022 వేసవిని మినహాయిస్తే.. గత నాలుగేళ్లలో హడావుడి కనిపించలేదు.

గత ఏడాది దసరా, విరూపాక్ష లాంటి మిడ్ రేంజ్ సినిమాలే హవా సాగించాయి. ఆ వేసవిలో బిగ్గెస్ట్ హిట్‌గా ‘విరూపాక్ష’నే నిలిచింది. మరి ఈ వేసవిలో బిగ్గెస్ట్ మూవీ ఏదవుతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈసారి కూడా పెద్ద సినిమాలు ఏవీ వేసవి బరిలో లేనట్లే. ‘దేవర’ ఆల్రెడీ వాయిదా పడింది. ‘కల్కి’ వాయిదా పడటం లాంఛనమే అని భావిస్తున్నారు. రేసులో మిగిలినవన్నీ మిడ్ రేంజ్ మూవీసే. వీటిలో సమ్మర్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలవగలా సత్తా ఉన్న మూవీగా ‘టిల్లు స్క్వేర్’నే భావిస్తున్నారు.

ఈ వేసవిలో ఫ్యామిలీ స్టార్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఓం భీం బుష్ లాంటి మిడ్ రేంజ్ క్రేజీ మూవీస్ వస్తున్నాయి. కానీ వాటిని మించి ‘టిల్లు స్క్వేర్’కు హైప్ ఉంది. రెండేళ్ల కిందట పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ‘డీజే టిల్లు’ సెన్సేషనల్ హిట్ అయింది. రిలీజ్ తర్వాత రోజులు గడిచేకొద్దీ దాని క్రేజ్ పెరిగింది.

ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఆ సినిమా పాటలు, డైలాగులు వైరల్ అయ్యాయి. దీంతో ‘టిల్లు స్క్వేర్’ మీద అంచనాలు పెరిగిపోయాయి. సినిమా చాలా ఆలస్యం అయినా సరే హైప్ పెరిగిందే తప్ప తగ్గలేదు. రిలీజ్ దగ్గర పడేసరికి క్రేజ్ ఇంకా పెరుగుతోంది.

ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలోనే వస్తాయని అంచనా వేస్తున్నారు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే కలెక్షన్లు ఒక రేంజిలో ఉంటాయనడంలో సందేహం లేదు. మిడ్ రేంజ్ మూవీస్‌లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్చి 29న ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on March 21, 2024 6:36 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

5 mins ago

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

1 hour ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

3 hours ago

భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…

4 hours ago

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

5 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

5 hours ago