నోయల్ షాన్ గతేడాది బిగ్‍బాస్ స్టేజీ మీదినుంచి తన స్నేహితుడు రాహుల్ సిప్లిగంజ్‍తో మాట్లాడాడు. అప్పుడే కాస్త ఓవర్ చేసాడని మాట్లాడుకున్నారు. ఇక బిగ్‍బాస్ హౌస్‍లోకి వెళితే ఆ అతి ఎలా వుంటుందనేది ఒక్క వారంలోనే నోయల్ సినిమా చూపించేసాడు. ప్రేక్షకులలో సింపతీ క్రియేట్ అయితే బిగ్‍బాస్ ఈజీగా గెలవవచ్చునని నోయల్ గత రెండు సీజన్ల విన్నర్లను చూసి ఒక ఐడియాకు వచ్చేసినట్టున్నాడు. అందుకే బిగ్‍బాస్ షో మొదటి వారంలోనే చాలా రంగులు చూపించేసాడు. అసలు తనకు అన్నీ తెలుసుననే బిల్డప్ ఇవ్వడంతో పాటు ‘నువ్వు నన్ను బ్రేక్ చేయలేవు’, ‘నువ్వు నన్ను మోసం చేయలేవు’ అనే స్టేట్‍మెంట్స్ ఇస్తూ చాలా అతి చేసాడు. రెండు రోజుల పాటు ఇద్దరు కంటెస్టెంట్లను వేరే రూమ్‍లో వుంచి పంపిస్తే, వాళ్లు హౌస్‍లోకి వచ్చాక వాళ్లేదో పరాయి దేశం నుంచి దిగిపోయారన్నట్టు గ్రూపులు కట్టాడు. వాళ్లకు అస్సలు సహకరించకుండా ఒక బృందాన్ని పూర్తిగా గేమ్‍లో లేకుండా చేసాడు. ఇక ‘కట్టప్ప ఎవరు?’ అనేది ముఖమ్మీద స్టాంప్ కొట్టాలి అనగానే తనకు కొందరు స్టాంప్ కొట్టడంతో అది చూసి తన తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారని, అలాంటి బాధ ఇంకొకరికి ఇవ్వలేనంటూ తన ముఖమ్మీద తానే స్టాంప్ కొట్టుకున్నాడు.
అలా కుదరదని బిగ్‍బాస్ అనగానే అంతకుముందు అలా తనకు ముద్ర కొట్టారని బాధ పడిపోయాడని అమ్మ రాజశేఖర్ గురించి చెప్పిన తనే మళ్లీ అదే రాజశేఖర్ ముఖమ్మీద స్టాంప్ వేసాడు. అయితే ఈసారి హౌస్‍లో కొందరు ముదుర్లు కూడా వున్నారు. అందుకే నోయల్ బాబు సింపతీ క్రియేషన్‍ని కనిపెట్టి ఇంత సింపతీ గేమ్ ఆడక్కర్లేదు అనేసారు. నెక్స్ట్ విన్నర్ నేనే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో వచ్చిన నోయల్ ఇప్పుడు మేల్ కంటెస్టెంట్స్ లో అత్యధిక నెగెటివిటీ సొంతం చేసుకున్నాడు.
This post was last modified on September 12, 2020 10:37 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…