Movie News

గామి.. పెట్టుబడిదారులకు సెటిల్మెంట్

మంచి కాన్సెప్ట్‌తో సినిమా తీయాలని తపన పడే యువ దర్శకులను ప్రోత్సహించడానికి సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు తలో చేయి వేయడం.. పెట్టుబడి పెట్టడం.. ఎప్పట్నుంచో ఉన్న ట్రెండే. ఇలా క్రౌడ్ ఫండింగ్‌తో తీసిన సినిమాలు కొన్ని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఐతే ఇలాంటి సినిమాలు కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ అయి పెట్టుబడిదారులకు లాభాలు అందించిన ఉదంతాలు మాత్రం పెద్దగా కనిపించవు.

ఐతే ఇప్పుడు ‘గామి’ మూవీ ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేసింది. విద్యాధర్ కగిత అనే కొత్త దర్శకుడు.. యంగ్ హీరో విశ్వక్సేన్ కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో తనతో మొదలుపెట్టిన సినిమా ఇది. చాందిని చౌదరి హీరోయిన్. అతడి విజన్ నచ్చి సోషల్ మీడియా క్యాంపైనింగ్‌లో చాలామంది చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఐతే చిన్న సినిమా అయినా సరే.. రాజీ లేకుండా ఒక పెద్ద సినిమా రేంజ్ ఔట్ పుట్ తీసుకురాగలిగింది టీం.

ఆరేళ్లు కష్టపడి సినిమాను పూర్తి చేశాక యువి క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థ అండతో విడుదలైన ‘గామి’ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నందుకుంది. సినిమాలో కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నా.. అక్కడక్కడా లాజిక్స్ మిస్సయినా.. ఓవరాల్‌గా ఓ మంచి ప్రయత్నంగా గుర్తింపు తెచ్చుకుంది ‘గామి’. సినిమాను మంచి లాభాలకు అమ్మడమే కాదు.. బయ్యర్లందరినీ సేఫ్ జోన్లోకి తీసుకురాగలిగింది ‘గామి’ టీం. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ రన్ ముగిసింది. ‘గామి’కి వచ్చిన లాభాలను ఇప్పుడు చిన్న చిన్న పెట్టుబడిదారులకు పంచే ప్రయత్నంలో పడింది టీం.

మొదట్నుంచి సినిమా కోసం డబ్బలు ఇచ్చిన వాళ్లందరి లిస్ట్ తీసి.. వారికి లాభాలతో కలిపి ఇన్వెస్ట్‌మెంట్ వెనక్కి ఇవ్వబోతున్నట్లు మెయిల్ పంపారు. త్వరలోనే సెటిల్మెంట్ జరగబోతోంది. మున్ముందు క్రౌడ్ ఫండింగ్‌తో తీసే సినిమాలకు ‘గామి’ సక్సెస్ ఒక మంచి ప్రోత్సాహంలా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

This post was last modified on March 19, 2024 4:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago