మలయాళం లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మంజుమ్మెల్ బాయ్స్ సగర్వంగా 200 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టేసింది. స్టార్ హీరోలు లేకుండా కంటెంట్ నమ్ముకుని కేవలం పది కోట్ల లోపే బడ్జెట్ తో తీసి ఇంత పెద్ద మైలురాయి చేరుకున్న తొలి సినిమాగా ఇది దక్కించుకుంటున్న ప్రశంసలు మాములుగా లేవు. ఈ ఫీట్ ని గతంలో 2018, పులిమురుగన్ లాంటివి అందుకున్నప్పటికీ వాటిలో మోహన్ లాల్, టోవినో థామస్ లాంటి నోటెడ్ ఆర్టిస్టులున్నారు. కానీ మంజుమ్మెల్ బాయ్స్ లో దాదాపు అన్నీ కొత్త ముఖాలే. ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం లేనివి. అయినా గొప్ప విజయం సాధించింది.
తెలుగు ఆడియన్స్ దీని డబ్బింగ్ వెర్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ముందు మార్చి 22 అన్నారు కానీ ఆ సూచనలు గత వారం నుంచే కనిపించడం లేదు. పోనీ వచ్చే వారం అనుకుంటే టిల్లు స్క్వేర్ లాంటి బలమైన పోటీ ఉంది. పైగా కాంగ్ వర్సెస్ గాడ్జిల్లాతో ముప్పు ఉంది. ఆపై వారం ఫ్యామిలీ స్టార్ కోసం కుటుంబ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో వీలైనంత త్వరగా మంజుమ్మెల్ డబ్బింగ్ తీసుకుని రావాల్సి ఉంది. హనుమాన్ నిర్మాత, మైత్రి కలిసి పంపిణి చేస్తున్నారనే టాక్ వచ్చింది కానీ ఆ దిశగా వేగంగా అడుగులు పడలేదు. రిలీజ్ ఎప్పుడో కన్ఫర్మ్ చేయలేదు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం డబ్బింగ్, సెన్సార్ ఇంకా పెండింగ్ ఉండటం వల్ల జాప్యం జరుగుతోందని తెలిసింది. ప్రేమలు ఇదే తరహాలో కొంచెం లేట్ చేయడం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించింది. కానీ అపోజిషన్ వీక్ అయిపోవడంతో మెల్లగా పుంజుకుని పది కోట్ల గ్రాస్ ని లాగేసింది. ఒకవేళ పోటీ తీవ్రంగా ఉంటే ఇంత ఫీట్ సులభంగా వచ్చేది కాదు. కానీ మంజుమ్మెల్ బాయ్స్ కు ఆ సానుకూలత లేదు. ఒకవేళ వేరే ఏదైనా తేదీ అనుకుంటే దాన్ని ప్రకటిస్తే సరిపోతుంది. లేదంటే ఓటిటిలో వచ్చాక చూద్దాంలే అని జనాలు అనుకుంటే మాత్రం ఒరిజినల్ ఫలితం రిపీట్ కాకపోయే ప్రమాదముంది
This post was last modified on March 19, 2024 4:17 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
రీసెంట్ గా స్పిన్నర్ అశ్విన్ టీమిండియాకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బౌలర్ కూడా…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…