Movie News

బోల్డ్ క్యారెక్టర్.. బిరియాని.. అనుపమ లాజిక్

మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కెరీర్లో చాలా వరకు ట్రెడిషనల్ క్యారెక్టర్లే చేసింది. ఆమె లుక్స్ పద్ధతిగా ఉండేవి. కొంచెం గ్లామరస్‌గా కనిపించేది కానీ.. ఎక్స్‌పోజింగ్ చేయడం, ఇంటిమేట్ సీన్లు-లిప్ లాక్స్ లాంటి వాటికి అస్సలు వెళ్లేది కాదు. మాతృభాష మలయాళంలోనే కాదు.. అత్యధిక చిత్రాల్లో నటించిన తెలుగులోనూ ఆమె అదే బాటలో సాగింది.

అలాంటి అమ్మాయి ‘టిల్లు స్క్వేర్’కు వచ్చేసరికి ఒక్కసారిగా షాకుల మీద షాకులు ఇచ్చేసింది. లిప్ లాక్స్, క్లీవేజ్ షోలు, ఇంటిమేట్ సీన్లు.. అబ్బో మొత్తంగా అనుపమకు ఈ సినిమా ఒక మేకోవర్ అని చెప్పొచ్చు. ఉన్నట్లుండి ఇంత బోల్డ్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ‘టిల్లు స్క్వేర్’ నుంచి కొత్త పాట రిలీజైన సందర్భంగా టీం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో దీని గురించే మీడియా వాళ్లు పదే పదే ప్రశ్నలు వేశారు.

దీంతో ఒకింత అసహనానికి గురైన అనుపమ.. ఒకే రకం క్యారెక్టర్లు చేసి చేసి బోర్ కొట్టేసిందని చెప్పింది. బోల్డ్ క్యారెక్టర్ చేయడం గురించి అడిగిన ఓ విలేకరిని ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీరు బిరియానీ తింటారా, ఇష్టమా.. మరి ప్రతి రోజూ అదే తింటారా? అప్పుడప్పుడూ తింటారు అంతే కదా.. అలాగే ఎప్పుడూ ఒకే రకం ఫుడ్ తిననట్లే.. ఒకే రకం పాత్రలు కూడా చేయకూడదు.. అప్పుడు మనకు మనమే బోర్ కొట్టేస్తాం”.. అని అనుపమ అంది.

‘టిల్లు స్క్వేర్’లో తాను చేసిన లిల్లీ లాంటి క్యారెక్టర్‌ను వదులుకుంటే తాను స్టుపిడ్ అయ్యేదాన్నని.. ఏ కమర్షియల్ సినిమాలో కూడా ఇంత మంచి హీరోయిన్ క్యారెక్టర్ ఉండదని.. ఈ విషయం తాను రాసిస్తానని అనుపమ చెప్పింది. ఇంతలో మైక్ అందుకున్న హీరో కమ్ రైటర్ సిద్ధు జొన్నలగడ్డ.. “మేడం బిగినర్స్ మిస్టేక్ చేసే ఛాన్సే లేదు. నేను చేస్తానేమో కానీ తను చేయదు. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రంగంలోకి దిగింది” అనడంతో అనుపమ గొల్లుమని నవ్వింది.

This post was last modified on March 19, 2024 10:34 am

Share

Recent Posts

ఇరుముడి… క్రిష్‌కు ఇంకా బాకీ!

‘ఇరుముడి’ ఇప్పుడు పెద్ద హిట్. రవితేజ మాస్ ఇమేజ్ ఒక వైపు ఉన్నా, సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసింది అందులోని…

1 hour ago

అన్న రాలేదు.. వదినమ్మ ఒక్కరే ఎందుకు?

విజయ్ దేవరకొండ.. తమ్ముడి కెరీర్ మొదట్లో సినిమాలకు తనవంతు పుష్ ఇచ్చాడు. కానీ ఆనంద్‌కు సొంతంగా పేరు రావడం మొదలయ్యాక…

4 hours ago

మహాకాళి ముందు జాగ్రత్త పడుతోంది

హనుమాన్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాణంలో మహాకాళి రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా…

4 hours ago

రాజకీయాలకు అయ్యన్న గుడ్ బై

టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ…

5 hours ago

ప్రభాస్ ఓడిన జానర్లో రవితేజ గెలవాలి

ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్న రవితేజ తన అభిమానుల ఏళ్ళ తరబడి ఆకలిని ఒకేసారి తీర్చేశాడు. హిట్…

6 hours ago

విజయశాంతికి బెర్త్ ఖరారు?

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవి ఖరారైనట్లు హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల మంత్రి…

7 hours ago