విడుదలైన మొదటి రెండు రోజులు చాలా నెమ్మదిగా ఉన్న ప్రేమలు తర్వాత ఒక్కసారిగా ఊపందుకుని బాక్సాఫీస్ వద్ద డామినేషన్ చూపించడం వసూళ్లలో స్పష్టమైపోయింది. గామి, భీమాలతో పోటీ కారణంగా మొదటి వారం ఆశించిన స్థాయిలో నెంబర్లు నమోదు చేయకపోవడంతో హిట్టవుతుందా లేదానే అనుమానం ట్రేడ్ లో వచ్చింది. అయితే బిజినెస్ తక్కువకు చేయడం, రాజమౌళి గెస్టుగా ఈవెంట్ జరపడం, మహేష్ బాబు ట్వీట్ ఇవన్నీ తర్వాతి రోజుల్లో సానుకూల అంశాలుగా పని చేశాయి. క్రమంగా కలెక్షన్లు పెరిగి భారీ లాభాల వైపు పరుగులు పెడుతోంది.
మొత్తం పది రోజులకు గాను తెలుగు ప్రేమలు పది కోట్ల గ్రాస్ కి దగ్గరగా వెళ్లిందని ట్రేడ్ టాక్. నిన్న మొన్న బుక్ మై షోలో కొత్త రిలీజుల కంటే దీనికే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం గమనార్హం. యావరేజ్ గా పదివేలకు పైగానే టికెట్లు అమ్ముడుపోయాయి. ముఖ్యంగా నగరాలు, జిల్లా కేంద్రాల్లో ఈవెనింగ్ షో, మ్యాట్నీలు హౌస్ ఫుల్స్ నమోదు కావడం విశేషం. అటు మలయాళంలోనూ మళ్ళీ పికప్ చూపించడం అనూహ్య పరిణామం. గామి ఫైనల్ రన్ కు దగ్గరల్ ఉండగా మాస్ నే నమ్ముకున్న భీమాకు సరిపడా స్క్రీన్లు అందుబాటులో ఉంచినా అవి టికెట్ల రూపంలో భారీగా బదిలీ కావడం లేదు.
ఈ లెక్కన ప్రేమలుని వచ్చిన లాభాల కోణంలో చూసుకుంటే బ్లాక్ బస్టర్ ముద్ర పడటం ఖాయంగా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం రిలీజైన తమిళంలోనూ రెస్పాన్స్ బాగుందని చెన్నై రిపోర్ట్. మొత్తం అన్ని భాషలకు కలిపి ఇప్పటిదాకా 115 కోట్లకు పైగా వసూలు చేసిన ప్రేమలు తక్కువ బడ్జెట్ తో రూపొంది ఇండస్ట్రీ హిట్స్ సాధించిన టాప్ 10 సినిమాల్లో చోటు దక్కించుకునే దిశగా పరుగులు పెడుతోంది. దీని దెబ్బకే మమిత బైజు తెలుగు యువతకు కూడా ఫెవరెట్ గా మారిపోయింది. ఎంతగా అంటే మొన్నో యుట్యూబర్ ఏకంగా స్టేజి మీదే ఆమెకు కర్పూరం వెలిగించి హారతి ఇచ్చేంత.
This post was last modified on March 18, 2024 11:11 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…