పెద్ద సినిమాల నుంచి ఏవైనా విశేషాలు పంచుకోవాలంటే.. ఏదైనా పండుగో లేదంటే హీరో పుట్టిన రోజునో సందర్భంగా ఎంచుకుంటారు. వేరే సమయాల్లో, అభిమానుల్లో ఏ అంచనాలు, ఆకాంక్షలు లేనపుడు కొత్త విశేషాలు పంచుకోరు. అందులోనూ షూటింగ్ ఆగిపోయిన సినిమా నుంచి ఎవ్వరూ ఊహించని టైంలో గ్లింప్స్ లాంటిదేదైనా రిలీజ్ చేస్తున్నారంటే షాక్ అవ్వక తప్పదు.
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ టీం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అలాంటి షాకే ఇవ్వబోతోందట. ఈ మూవీ నుంచి అతి త్వరలో ఓ టీజర్ లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. అది చిన్న డైలాగ్ టీజర్ అని అంటున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సైతం చెప్పకనే చెప్పేసింది. ఎక్స్‌పెక్ట్ ద అన్ఎక్స్‌పెక్టెడ్ ఫ్రం ఉస్తాద్.. అంటూ ఆ సంస్థ ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు.
ఐతే సమయం సందర్భం లేకుండా.. అభిమానుల నుంచి ఎలాంటి డిమాండ్ లేనపుడు ఈ టీజర్ వదలడం ఏంటి అని ఆశ్చర్యం కలగడం ఖాయం. ఈ సినిమా షూట్ కొన్ని నెలల కిందటే ఆగిపోయింది. పవన్ ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీ. మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో, ఈ సినిమా షూట్‌లో పాల్గొంటాడో కూడా క్లారిటీ లేదు.
ఐతే ఈ నెల 19న ముంబయిలో అమేజాన్ సంస్థ నిర్వహించే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ టీం పాల్గొనబోతోందట. అక్కడ ప్రదర్శించేందుకు సినిమా నుంచి ఒక స్పెషల్ టీజర్ రెడీ చేశారట. అదే అభిమానుల కోసం ముందు లాంచ్ చేయబోతున్నారట. ఈ సడెన్ సర్ప్రైజ్ పవన్ ఫ్యాన్స్‌ను ఏమేర మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on March 17, 2024 6:50 am
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…