ఒక దర్శకుడి తొలి సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే వెంటనే అవకాశాలు వరుస కట్టేస్తాయి. రెండో సినిమా కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఎన్నో ఏళ్ల నుంచి రాసుకుంటున్న కథలను వరుసబెట్టి పట్టాలెక్కించేస్తుంటారు తొలి సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకులు. ఐతే ‘ఉప్పెన’తో సంచలనం రేపిన బుచ్చిబాబు సనా మాత్రం మూడేళ్ల తర్వాత కూడా తన రెండో చిత్రాన్ని మొదలుపెట్టలేకపోయాడు.
అలా అని అతడికి అవకాశాలు లేక కాదు. రెండో సినిమాను ముందు జూనియర్ ఎన్టీఆర్‌తో కమిటయ్యాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ రద్దయింది. తర్వాత రామ్ చరణ్‌తో సినిమా ఓకే అయింది. కానీ ఇది పట్టాలెక్కడంలోనూ చాలా ఆలస్యం జరిగింది. స్క్రిప్టు సహా అన్నీ రెడీగా ఉన్నప్పటికీ రామ్ చరణ్ అందుబాటులోకి రాకపోవడంతో సినిమా సెట్స్ మీదికి వెళ్లలేదు.
చరణ్‌తో సినిమా ఓకే అయ్యాక కూడా ఏడాది పైగా ఎదురు చూపులు తప్పలేదు బుచ్చిబాబుకు. ఐతే ఎట్టకేలకు అతడి నిరీక్షణ ఫలించబోతోంది. చరణ్‌తో బుచ్చిబాబు తీయబోయే సినిమాకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 20న ఈ సినిమాకు ప్రారంభోత్సవ వేడుక నిర్వహించబోతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రాబోతోంది.
చరణ్ 16వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టులో జాన్వి కపూర్ కథానాయికగా నటించబోతున్న విషయాన్ని ఇటీవలే ప్రకటించారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి రత్నవేలు ఛాయాగ్రహణం సమకూరుస్తాడు. ‘ఉప్పెన’ను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్సే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయనుంది. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో చరణ్ త్వరలోనే బుచ్చిబాబు మూవీ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటాడు.
This post was last modified on March 15, 2024 3:16 pm
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…