సౌత్ లో అత్యధిక డిమాండ్ ఉన్న దర్శకుల్లో లోకేష్ కనగ రాజ్ ఒకరు. కథ కంటే కథనం, స్టైలిష్ మేకింగ్ తో అభిమానులని ఆకట్టుకునే ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ స్క్రిప్ట్ మీద పని చేస్తున్న సంగతి తెలిసిందే. వెట్టయాన్ పూర్తి కాగానే తలైవర్ సెట్లోకి అడుగు పెడతారు. ఈలోగా ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తున్నారు. మాస్టర్, లియో తర్వాత విజయ్ తో ఇంకో సినిమా తీయాలని ప్లాన్ చేసుకున్న లోకేష్ కు అది సాధ్యపడే సూచనలు లేనట్టేనని చెన్నై టాక్. దీని స్థానంలో రెబెల్ స్టార్ ప్రభాస్ తో ఒక క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ లాక్ చేసినట్టు వినికిడి.
అధికారికంగా ప్రకటించలేదు కానీ కెవిఎన్ ప్రొడక్షన్స్ కోసం ప్రభాస్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇవాళ లోకేష్ కు బర్త్ డే విషెస్ చెబుతూ సదరు సంస్థ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. అయితే అందులో హీరో ప్రస్తావన, ఇతర సాంకేతిక వివరాలు ఏమీ లేవు. ఈ రెండు అంశాలను లింక్ చేసుకుని చూస్తే హీరో డార్లింగేనని అనిపిస్తోంది. కాకపోతే చాలా టైం పడుతుంది. ఎందుకంటే లోకేష్ రజని ప్రాజెక్టు పూర్తి చేసే లోపు 2025 వేసవి వచ్చేస్తుంది. ఆ ఏడాది దీపావళికి రిలీజ్ ప్లాననుకుంటున్నారు. ఇటు ప్రభాస్ కూడా బిజీగా ఉన్నాడు. కల్కి 2898 ఏడి అవ్వగానే ది రాజా డీలక్స్ ఫినిష్ చేయాలి.
ఇంకోవైపు సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వంని సమ్మర్ లో మొదలుపెట్టేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో ప్రభాస్, లోకేష్ కనగరాజ్ చేతులు కలపాలంటే కనీసం ఏడాదిన్నర ఎదురు చూడాలి. పైగా ఇంకోవైపు డార్లింగ్ కోసం హను రాఘవపూడి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టేశాడు. బడ్జెట్ ఎంత ఉన్నా సరే వేగానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభాస్ రాబోయే మూడేళ్ళలో కనీసం అయిదు రిలీజులు ఉండేలా చూసుకుంటున్నాడు. సో లోకేష్ కాంబినేషన్ గురించి వచ్చిన వార్త నిజమవ్వాలనే కోరుకుందాం. ఇతని టాలీవుడ్ ఎంట్రీకి ఇంత కన్నా బెస్ట్ ఆప్షన్ అతనికి ఏముంటుంది.
This post was last modified on March 14, 2024 1:18 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…